Parakramam: ప్రతి కామన్ మ్యాన్‌కు కనెక్ట్ అయ్యే సినిమా..

ABN , Publish Date - Aug 16 , 2024 | 08:21 PM

బి‌ఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, నిర్మాత ఎస్‌కేఎన్ అతిథులుగా హాజరయ్యారు.

Parakramam Movie Trailer Launch Event

బి‌ఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) పతాకంపై బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘పరాక్రమం’ (Parakramam). శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ నుంచి యుబైఏ సర్టిఫికేట్ పొందింది. ఈ నెల 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని (Parakramam Trailer Released) తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan), నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘పరాక్రమం’ ట్రైలర్ లాంఛ్‌కు వచ్చిన నిర్మాత ఎస్‌కేఎన్, హీరో సందీప్ కిషన్‌కు థ్యాంక్స్. ప్రతి కామన్ మ్యాన్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ పోస్టర్‌‌లో మీకు సత్తి బాబు, లోవరాజు అనే రెండు క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. లోవరాజు తండ్రి సత్తిబాబు. ప్రతి ఒక్కరిలో సత్తి బాబు ఉంటాడు, లోవరాజు ఉంటాడు. సత్తిబాబు నుంచి లోవరాజుకు జరిగే ట్రాన్సఫర్మేషన్ ఈ సినిమా. కామన్ మ్యాన్‌లా బతకడం కష్టం. అందరి లైఫ్‌లో హీరోలు ఉంటారు, విలన్స్ ఉంటారు. ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తా. ఆయనకు భారతరత్న కూడా చిన్నదే అనేది నా అభిప్రాయం. చిరంజీవి అంటే శిఖరం. ఆయన హీరోగా నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. నేను అభిమానించే నా అభిమాన నటుడు చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. (Parakramam Trailer Launch Event)


BSK.jpg

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. బండి సరోజ్ కుమార్ చాలా జెన్యూన్ ఫిలింమేకర్. ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ఆయన సినిమా ఈవెంట్స్ కూడా రొటీన్‌గా ఉండవు. నేను చెన్నైలో పోర్కాలం అనే సినిమా చూసి ఎవరీ దర్శకుడు అనుకుని ఆశ్చర్యపోయా. ఆయన బండి సరోజ్ కుమార్. ఆ తర్వాత ఆయనను ఫేస్ బుక్‌లో వెతికి మరీ టచ్‌లోకి వెళ్లా. మనం ఇండస్ట్రీలోకి గెలవడానికే రాము. ఇదొక ప్రయాణం. ప్రేక్షకుల అభిమానం పొందడానికి ప్రయత్నిస్తుంటాం. బండి సరోజ్ కుమార్ అలాంటి జర్నీ చేస్తున్నారు. ఆయన సినిమాలు యూట్యూబ్‌లో చూసి నేనూ డబ్బులు పంపించాను. నాకు తెలిసిన వారితో కూడా పంపించా. నేను లౌక్యానికి లొంగుతాను. బండి సరోజ్ కుమార్ లొంగడు. స్వచ్ఛంగా సినిమాలు చేస్తుంటాడు. పరాక్రమం ఒక జెన్యూన్ ఫిల్మ్. ఈ సినిమాను ఆదరించాలని కోరుతూ.. ఆయన సినిమాలకు సపోర్ట్ చేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని మాటిస్తున్నాను అని తెలిపారు.

నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. బండి సరోజ్ కుమార్ డైరెక్టర్‌గా, నటుడిగా నాకు ఇష్టం. ఆయన టాలెంటెడ్ ఫిలింమేకర్. బండి సరోజ్ కుమార్ ‘మాంగల్యం’ వంటి సినిమాలు చూసి నేనూ డబ్బులు పంపాను. ‘పరాక్రమం’ సినిమా మన మెగాస్టార్ చిరంజీవి‌గారి బర్త్‌డే రోజైన ఆగస్ట్ 22న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు నా వంతు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పరాక్రమం సినిమా బ్లాక్ బస్టర్ అయినా, సూపర్ హిట్ అయినా, యావరేజ్ అయినా నేను బండి సరోజ్ కుమార్‌తో సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 08:21 PM

Parakramam: గల్లీ క్రికెట్ నేపథ్యంలో పరాక్రమం.. విడుదల ఎప్పుడంటే?

Parakramam: ప్రముఖులు ఆవిష్కరించిన బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ టీజర్

Parakramam: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా థియేటర్లలోకి ‘పరాక్రమం’

Parakramam: రుద్రమై.. రౌద్రమై.. ‘పరాక్రమం’ డ్రీమ్ సాంగ్

Parakramam: ‘పరాక్రమం’ ప్రీ టీజర్ విడుదల