Parakramam: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా థియేటర్లలోకి ‘పరాక్రమం’

ABN , Publish Date - Jul 23 , 2024 | 08:18 PM

బిఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న సందర్భంగా దర్శక హీరో బండి సరోజ్ కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో తన టీమ్‌తో మీడియా సమావేశం నిర్వహించారు.

Parakramam Hero Bandi Saroj Kumar About Chiranjeevi

బిఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) పతాకంపై బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరాక్రమం’ (Parakramam). శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న సందర్భంగా దర్శక హీరో బండి సరోజ్ కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో తన టీమ్‌తో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూవీ రిలీజ్ అనౌన్స్‌మెంట్ టీజర్‌ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా ‘పరాక్రమం’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా ఆగస్ట్ 22న విడుదల చేస్తున్నాం. చిరంజీవిని గారు అని పిలవమని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మన ఇంట్లో అమ్మను అమ్మ అనే పిలుస్తాం అమ్మగారు అని పిలవం. అలాగే నన్ను ఎంతో ఇన్స్‌పైర్ చేసిన చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తాను. ఆయన నాకు శివుడిలా భావిస్తా. ‘పరాక్రమం’ సినిమా విషయానికి వస్తే ఇదొక సంఘర్షణతో కూడుకున్న కథ. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను. నారాయణగూడ బాయ్స్ హాస్టల్‌లో ఉండేవాడిని. ఆర్టీవో ఆఫీసర్ అబ్బాయి మా పొరుగునే ఉండేవాడు. వాళ్లది రిచ్ ఫ్యామిలీ. నేను ఒక రోజు రోడ్డు మీద క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటే క్రికెటర్ అవుతావా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వెనక చూసుకుని ముందుకు వెళ్లాలి బ్రదర్ అన్నాడు. ఆరోజు ఆయన అన్న మాటలు నాలో కసిని నింపాయి. ఒకరోజు అతను నన్ను తలెత్తుకుని చూడాలి అనుకున్నా. ఆ ఫైర్‌తోనే ఈ సినిమాలో నా లోవరాజు క్యారెక్టర్ రాసుకున్నా. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ.. అతనికి థ్యాంక్స్ చెబుతున్నా. (Parakramam Ready to Release)


BSK.jpg

నేను గతంలో ‘నిర్భందం, నిర్భందం 2, మాంగళ్యం’ సినిమాలను రూపొందించాను. అవి డిజిటల్‌గానే విడుదలయ్యాయి. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్సయ్యా. అలా మార్చి చేసిన సినిమానే ‘పరాక్రమం’. నా గత సినిమాలు కొన్ని వర్గాల ఆడియన్స్ మాత్రమే చూశారు. కానీ ఈ ‘పరాక్రమం’ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నేను చిత్ర పరిశ్రమలో ఎదగాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2024 | 09:06 PM