Parakramam: ‘పరాక్రమం’ ప్రీ టీజర్ విడుదల

ABN , First Publish Date - 2023-08-22T07:07:32+05:30 IST

బి‌ఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ పతాకం‌పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున్న చిత్రం ‘పరాక్రమం’. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్‌లో 30 రోజులో షూటింగ్ పూర్తి చేసి 14 ఫిబ్రవరి, 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Parakramam: ‘పరాక్రమం’ ప్రీ టీజర్ విడుదల
Bandi Saroj Kumar

బి‌ఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ పతాకం‌పై బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున్న చిత్రం ‘పరాక్రమం’ (Parakramam). ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్‌లో 30 రోజులో షూటింగ్ పూర్తి చేసి 14 ఫిబ్రవరి, 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘నేను ఒక నటుడిగా, దర్శకుడిగా మీలో కొంత మందికి తెలిసే ఉండొచ్చు. ‘కళ నాది. వెల మీది’ అనే కాన్సెప్ట్‌తో, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసిన ‘నిర్బంధం, మాంగల్యం’ వంటి కల్ట్ సినిమాలతో నాకు లక్షలాది ప్రేక్షకుల అభిమానం లభించింది. వాళ్ళు ఇచ్చిన బలంతో ఇప్పుడు నేను బి‌ఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ అనే నా సొంత నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు రాబోతున్నాను. పిల్లా, పాపలతో కుటుంబాలు సినిమా హాల్‌కు తరలి వచ్చే కథాంశంతో ‘పరాక్రమం’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘I, ME, MYSELF’ దీని ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 14 ఫిబ్రవరి, 2024న విడుదల లక్ష్యంగా ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్‌తో 30 రోజులలో షూటింగ్ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.

ఈ చిత్ర కథాంశం గురించి చెప్పాలంటే.. గోదావరి జిల్లాలో ‘లంపకలోవ’ గ్రామంలో పుట్టిన ‘లోవరాజు’ అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్, ప్రేమ, నాటక రంగ జీవితం, రాజకీయం లాంటి ఘట్టాల ఆవిష్కరణ ఈ చిత్ర ముఖ్య కథాంశం. యువతను అన్ని విధాలుగా ఎంటర్‌టైన్‌ చేస్తూనే, వారిని మేల్కొలిపే ఒక మంచి కమర్షియల్ కథతో రాబోతున్నాను. నాతోపాటు ప్రతిభ ఉన్న నూతన నటీనటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయబోతున్నాను. దీనికి రచన, కూర్పు, సంగీతం, దర్శకత్వం నేనే వహిస్తుండగా మిగిలిన విభాగాల్లో ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం నిర్మించబడుతుంది. ఒక గొప్ప సంకల్పంతో నేను నిర్మించబోయే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాను’’ అని తెలిపారు.

BSK.jpg

ఇవి కూడా చదవండి:

***************************************

*Pawan Kalyan: అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

***************************************

*GOAT: మాస్ రగ్డ్ లుక్‌లో సుడిగాలి సుధీర్.. బీజీఎమ్ అదిరింది

***************************************

*Nelson Dilipkumar: ‘జైలర్‌’ సక్సెస్‌కు కారణం ఏమిటంటే..?

***************************************

Updated Date - 2023-08-22T07:07:56+05:30 IST