Parakramam: గల్లీ క్రికెట్ నేపథ్యంలో పరాక్రమం.. విడుదల ఎప్పుడంటే?

ABN , Publish Date - Feb 14 , 2024 | 05:48 PM

గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘పరాక్రమం’ చిత్రం 2024 సమ్మర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. గతంలో డిజిటల్‌లో విడుదలైన ‘మాంగల్యం’ చిత్రం‌తో బండి సరోజ్ కుమార్‌ నటుడిగా మంచి గుర్తింపును పొందారు. ఇప్పుడు ‘పరాక్రమం’ చిత్రం గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఉంటుందని.. సినీ, క్రికెట్ ఫ్యాన్స్‌ని కూడా ఈ సినిమా అలరించబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

Parakramam: గల్లీ క్రికెట్ నేపథ్యంలో పరాక్రమం.. విడుదల ఎప్పుడంటే?
Parakramam Movie Still

గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘పరాక్రమం’ (Parakramam) చిత్రం 2024 సమ్మర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. గతంలో డిజిటల్‌లో విడుదలైన ‘మాంగల్యం’ చిత్రం‌తో బండి సరోజ్ కుమార్‌ (Bandi Saroj Kumar) నటుడిగా మంచి గుర్తింపును పొందారు. ఇప్పుడు ‘పరాక్రమం’ చిత్రం గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఉంటుందని.. సినీ అభిమానులనే కాకుండా క్రికెట్ అభిమానులను కూడా ఈ సినిమా అలరించబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

బండి సరోజ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్, రచన, పాటలు మరియు నిర్మాతగా కూడా వ్యవహరించారు. గతంలో తన మూడు సినిమాలు డిజిటల్‌లో ‘వాచ్ అండ్ పే’ (డబ్బు కట్టి సినిమా చూసే పద్ధతి) ద్వారా విడుదల చేసి, విజయం సాధించారు. ఇప్పుడీ ‘పరాక్రమం’ చిత్రాన్ని థియేటర్లలో తన సొంత బ్యానర్ బిఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) ద్వారా విడుదల చేస్తున్నారు.


BSK-Parakramam.jpg

ఈ చిత్రంలో శాస్త్రీయ నృత్య కళాకారిణి శృతి సమన్వి మరియు నాగ లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. మరో 50 మంది నూతన నటీనటులు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. వీళ్లలో చాలామంది థియేటర్ ఆర్టిస్ట్‌లే కావడం విశేషం. ‘పౌర్ణమి, 100 పర్సంట్ లవ్’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన వెంకట్ ఆర్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే టీజర్ విడుదల చేసి.. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. (Parakramam Update)


ఇవి కూడా చదవండి:

====================

*Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..

***************************

*Bramayugam: మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటన

**********************

*Kayal Anandhi: ఆనంది ‘వైట్‌ రోజ్‌’ ఫస్ట్ లుక్‌ని ఎవరు విడుదల చేశారంటే..

*************************

*Harish Shankar: దమ్ముంటే హరీష్ శంకర్ తెల్లవార్లు మద్యం తాగాడని రాయ్..

***************************

Updated Date - Feb 14 , 2024 | 05:48 PM