Parakramam: రుద్రమై.. రౌద్రమై.. ‘పరాక్రమం’ డ్రీమ్ సాంగ్

ABN , Publish Date - Aug 04 , 2024 | 07:52 PM

బిఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ‘డ్రీమ్’ సాంగ్‌ను విడుదల చేశారు.

Parakramam Movie Still

బిఎస్‌కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) పతాకంపై బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరాక్రమం’ (Parakramam). శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ నుంచి యుబైఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా ఆగస్ట్ 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ‘డ్రీమ్’ సాంగ్‌ (Dream Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Also Read- Chiranjeevi - Ram Charan: మంచి మనసు చాటుకున్నారు.. బాధితులంతా త్వరగా కోలుకోవాలి!

ఈ ‘డ్రీమ్’ సాంగ్‌కు బండి సరోజ్ కుమార్ ఆకట్టుకునేలా లిరిక్స్ రాసి బ్యూటీఫుల్‌గా కంపోజ్ చేశారు. శ్రీ వైష్ణవి గోపరాజు ఈ పాటను ఆలపించారు. ఈ సాంగ్ విషయానికి వస్తే.. ‘వచ్చాడులే పరాక్రమం.. నా కన్నె మనసు చేరే కొత్త సంగమం.. తెచ్చాడులే పరాక్రమం.. నా చిట్టి గుండెలోకి వింత యవ్వనం..’ అంటూ అమ్మాయి తన మనసులోని తొలిప్రేమ భావాలను చెప్పేలా లవ్ ఫీల్‌తో సాగుతుందీ పాట. అలాగే విశ్వం, విజయం, రుద్రం, రౌద్రం అనే పదాలను ఈ పాటలో చక్కగా అమర్చారు. క్యాచీ ట్యూన్స్‌తో వచ్చిన ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Parakramam Movie Dream Song Released)


BSK.jpg

లవ్, యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి ఎలిమెంట్స్‌తో ఈ ‘పరాక్రమం’ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించామని చెబుతున్నారు బండి సరోజ్ కుమార్. ఈ సినిమాకు ఆయన కథ, కథనం, మాటలు, ఎడిటింగ్, సంగీతం, లిరిక్స్, నిర్మాత, దర్శకత్వం వంటి బాధ్యతలను నిర్వహించారు. ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. ఇప్పుడు విడుదలైన ఈ ‘డ్రీమ్’ సాంగ్ కూడా సినిమాపై క్రేజ్‌కు కారణమవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Aug 04 , 2024 | 07:52 PM

Parakramam: ‘పరాక్రమం’ ప్రీ టీజర్ విడుదల

Parakramam: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా థియేటర్లలోకి ‘పరాక్రమం’

Parakramam: ప్రముఖులు ఆవిష్కరించిన బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ టీజర్

Parakramam: గల్లీ క్రికెట్ నేపథ్యంలో పరాక్రమం.. విడుదల ఎప్పుడంటే?