Sai Dharam tej: లక్ష ఇచ్చి దులిపేసుకోవాలనుకోవడం లేదు... అబ్దుల్‌ గురించి తేజ్‌ ఏమన్నారంటే!

ABN , First Publish Date - 2023-04-27T16:00:08+05:30 IST

తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai dharam tej) స్పందించారు. ప్రమాదానికి (Road accident) గురై రోడ్డుపై పడి ఉన్న ఆయన్ను సకాలంలో ఆస్పత్రికి తరలించిన అబ్దుల్‌ ఫర్హాన్‌కు

Sai Dharam tej: లక్ష ఇచ్చి దులిపేసుకోవాలనుకోవడం లేదు... అబ్దుల్‌ గురించి తేజ్‌ ఏమన్నారంటే!

తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai dharam tej) స్పందించారు. ప్రమాదానికి (Road accident) గురై రోడ్డుపై పడి ఉన్న ఆయన్ను సకాలంలో ఆస్పత్రికి తరలించిన అబ్దుల్‌ ఫర్హాన్‌కు (abdul Farhana) తేజ్‌ ఎలాంటి సాయం చేయలేదని, కనీసం ఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వలేదని అబ్దుల్‌ వ్యాఖ్యలు చేశాడంటూ వస్తున్న వార్తలపై తేజ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

అసలేం జరిగిందంటే... సెప్టెంబర్‌ 10, 2021 రాత్రి సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురై స్పృహ తప్పి ఉన్న తరుణంలో అదే రోడ్డులో వెళ్తున్న యువకుడు అబ్దుల్‌ ఫర్హాన్‌ స్పందించి తేజ్‌ సకాలంలో ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటన జరిగిన రెండ్రోజులకు అబ్దుల్‌కు మెగా ఫ్యామిలీ వరాలు అంటూ లక్ష రూపాయలు నగదు, కారు, బైకు, బంగ్లా బహుమతిగా ఇచ్చిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కరు కొట్టాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని విరూపాక్ష’ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూల్లో తేజ్‌ చెప్పారు. పునర్జన్మను ఇచ్చిన అతనికి ఓ లక్ష ఇచ్చి చేతులు దులిపేసుకోవాలనుకోవడం లేదనీ, అసలు అతనికి ఎలాంటి రివార్డు ఇవ్వలేదని తేజ్‌ స్పష్టం చేశారు. మా ఫ్యామిలీ నుంచి ఎవరైనా సాయం చేసి ఉంటే ఆ విషయం నాకు తెలీదు. దాని గురించి నేను ఎవరిని అడగలేదని చెప్పారు. ‘‘అబ్దుల్‌కి ఏ సాయం కావలసినా నేరుగా ఫోన్‌ చేసి అడగొచ్చని ఆ రోజు మా వాళ్లు అబ్దుల్‌కు చెప్పారు. అతనికి డైరెక్ట్‌ ఫోన్‌ నంబర్‌ కూడా ఇచ్చాం’’ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

తాజాగా వస్తున్న వదంతులపై సాయిధరమ్‌ తేజ్‌ మరోసారి స్పందించారు. ఈ మేరకు ట్వ్టిట్టర్‌లో ఓ లేఖ విడుదల చేశారు. ‘నాపై, నా టీమ్‌పై దుష్ప్రచారం జరుగుతోందని తెలిసింది. ఇటీవల నేను ఇంటర్వ్లూలో చెప్పినట్లు నేను కానీ, నా టీమ్‌ కానీ అబ్దుల్‌కి ఎలాంటి రివార్డ్‌ ఇవ్వలేదు. అందుకు కారణం.. ఎంతోకొంత డబ్బు ఇచ్చి సరిపెట్టేద్దాం అనుకోవడం లేదు. అతను చేసిన సాయానికి నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అతనికి ఏ సాయం కావాలన్ని కోరమని నాది, మా మేనేజర్‌ నంబర్స్‌ ఇచ్చాం. అతను ఎప్పుడు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంపై ఇకపై మాట్లాడాలనుకోవడం లేదు’ అని సాయిధరమ్‌ తేజ్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం సాయితేజ్‌ ‘విరూపాక్ష’ చిత్రంలో సక్సెస్‌లో ఉన్నారు. కార్తిక్‌ దండు దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్‌ నిర్మించిన ఈచిత్రం సూపర్‌ హిట్టైన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-04-27T16:08:48+05:30 IST