Chiranjeevi: మెగా డ్యాన్స్ పోటీల సంబరాలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:47 PM
మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వివిధ నగరాలు, పట్టణాల్లోని ప్రతిభావంతులైన డాన్సర్స్ ను ప్రోత్సహించబోతున్నారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో డాన్స్ కాంపిటీషన్స్ జరుగబోతున్నాయి.
తెలుగు సినిమా వరకూ చిరంజీవి అంటే డాన్స్... డాన్స్ అంటే చిరంజీవి. తెలుగు సినిమా పాటల్లో డాన్స్ లో వేగాన్ని తీసుకొచ్చిన హీరో చిరంజీవి. చిరంజీవి సినిమాలకు నటన, పోరాట సన్నివేశాలతో పాటు డాన్స్ కోసం ప్రత్యేకంగా వెళ్ళే అభిమానులు ఎంతోమంది ఉంటారు. విశేషం ఏమంటే ఏ డాన్సుల కారణంగా కోట్లాది మంది హృదయాలలో చిరంజీవి చోటు దక్కించుకున్నాడో... అవే డాన్స్ మూమెంట్స్ ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటును దక్కించాయి. ఏకంగా 24 వేల డాన్స్ స్టెప్స్ వేసి ప్రపంచ రికార్డ్స్ ను నమోదు చేసుకున్నారు చిరంజీవి. గత యేడాది చిరంజీవికి ఈ అవార్డును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ చేతుల మీదగా అందించింది.
ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజు చిరు అభిమానులు వివిధ ప్రాంతాలలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో అత్యధిక శాతం మంది రక్తదానం చేస్తారు. అలానే నేత్రదానంకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేస్తుంటారు. అయితే ఈ సారి అఖిల భారత చిరంజీవి యువత మెగా ఉత్సవాల్లో భాగంగా డాన్స్ పోటీలను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన ప్రాధామిక సమాచారం గురించి చెబుతూ, ''తెలుగు సినిమాకే కాదు... యావత్ భారతీయ సినిమాకే డ్యాన్సుల్లో వన్నె తీసుకొచ్చిన వ్యక్తి చిరంజీవి. అందుకే ఆయన పుట్టినరోజు సందర్భంగా డాన్స్ పోటీలను నిర్వహించబోతున్నాం. వివిధ ప్రాంతాల్లో ఉన్న డాన్సర్స్ లోని ప్రతిభను ఈ పోటీల ద్వారా వెలికి తీయాలనుకుంటున్నాం. మెగా వేడుకల్లో నమోదు చేసుకోవల్సింది కోరుతున్నాం'' అని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియచేస్తామని అన్నారు.
Also Read: NTR: తారక్ సన్నబడటం వెనుక రీజన్ ఏమిటీ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి