Rani Mukerji: వచ్చే హోలీ పండక్కి మర్దానీ
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:33 PM
రాణి ముఖర్జీ నాయికగా నటించిన 'మర్దానీ' సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాల్లో మూడో భాగం 'మర్దానీ -3' వచ్చే యేడాది హోలీ కానుకగా విడుదల కానుంది.
బాలీవుడ్ కథానాయిక రాణీ ముఖర్జీ (Rani Mukerji) టైటిల్ రోల్ పోషిస్తున్న 'మర్దానీ -3' (Mardaani -3) చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 27న విడుదల చేయబోతున్నారు. 2026లో హోలీ (Holi) పండగ మార్చి 4న వస్తోంది. ఈ సందర్భంగా దానికి ముందే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. భారతదేశంలోనే అతి పెద్ద, ఏకైక మహిళా కాప్ ఫ్రాంచైజ్ గా 'మర్దానీ' రికార్డ్ క్రియేట్ చేసింది. గడిచిన పదేళ్ళలో వచ్చిన రెండు సీజన్లకు మంచి ఆదరణ లభించింది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న 'మర్దానీ -3'లో రాణి ముఖర్జీ న్యాయం కోసం నిస్వార్థంగా పోరాడే డేర్ డెవిల్ కాప్ శివానీ శివాజీ రాయ్ గా నటిస్తోంది. హోలీ పండగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని... తమ చిత్రంలో నాయిక కూడా చెడుపై విజయం సాధించడం కోసం తన ప్రాణాలను పణంగా పెడుతుందని, అందుకే ఈ పండగ సందర్భంగా 'మర్దానీ -3'ని విడుదల చేయడం సబబుగా భావించామని మేకర్స్ చెబుతున్నారు. అభిరాజ్ మినవాలా దర్శకత్వంతో 'మర్దానీ -3'ని రాణీ ముఖర్జీ భర్త ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.
Also Read: SSMB29: మహేశ్ - రాజమౌళి చిత్రానికి హాలీవుడ్ టెక్నిషియన్లు
Also Read: Singer Pravashti: పాడుతా తీయగా పై ఫైర్ అయిన సింగర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి