Devara: ‘దేవర’ ట్రైలర్ ఎలా ఉందంటే..

ABN, Publish Date - Sep 10 , 2024 | 05:47 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Young Tiger NTR in Devara

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సెప్టెంబర్ 27న విడుదలకాబోతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం ఊపుందుకున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా మంగ‌ళ‌వారం మేక‌ర్స్ ‘దేవర’ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన కార్యక్రమంలో నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల సమక్షంలో ఘ‌నంగా విడుదల చేశారు. 2 నిమిషాల 35 సెక‌న్లు ఉన్న ఈ ట్రైల‌ర్ మాస్ ఎలిమెంట్స్ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్టీఆర్ అభిమానులు, అలాగే యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్ కోరుకునే అంశాల‌తో నిండి ఉంది. (Devara Movie Trailer Released)

ట్రైల‌ర్‌ విషయానికి వస్తే.. ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైలర్ ప్రారంభ‌మైంది. తీర‌ప్రాంతంలో ఎలాంటి భ‌యాలు లేని ప్ర‌జ‌లు నివ‌సిస్తుంటారు. అక్క‌డ ఉండే భైరా (సైఫ్ అలీఖాన్‌) ఓ క్రూర‌మైన గ్యాంగ్‌తో ఆకృత్యాల‌కు పాల్ప‌డుతుంటాడు. ఆ ముఠా అక్క‌డ‌కొచ్చే ఓడ‌ల‌ను దోచుకోవ‌ట‌మే కాకుండా, కోస్ట్ గార్డుల‌ను కూడా చంపేస్తూ ర‌క్త‌పాతాన్ని సృష్టిస్తుంటారు. ఇలాంటి కొంత మంది కరుడుగట్టిన గ్రామ‌స్థుల‌కు భ‌యాన్ని ప‌రిచయం చేస్తాడు ‘దేవర’ (ఎన్టీఆర్‌). ఆ గ్రామాన్ని పెను ప్ర‌మాదం నుంచి ర‌క్షించే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు. (Devara Traler Talk)


ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజ‌న్స్‌, ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు.. చంపేంత ధైర్యం కాదు’ అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీ, ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఎలివేష‌న్ స‌న్నివేశాల‌ల‌తో ఉన్న ఈ ట్రైల‌ర్ అంద‌రిలో సినిమాపై ఉన్న అంచనాల‌ను మ‌రింత‌గా పెంచుతోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో.. భ‌యానికి అర్థం చెప్పే ప్ర‌తిరూప‌మైన పాత్ర ఒక‌టైతే.. భ‌య‌ప‌డుతూ ఉండే మ‌రో పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. ఈ రెండు పాత్రలను ట్రైలర్‌లో పరిచయం చేశారు. భైరా అనే అనే భ‌యంక‌ర‌మైన పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ క‌నిపించారు. ఎన్టీఆర్‌, సైఫ్ మ‌ధ్య ఉన్న స‌న్నివేశాల‌ను చూస్తుంటే సినిమా నెక్ట్స్ లెవ‌ల్ అనేంత‌గా అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులకు ఈ ట్రైల‌ర్‌లో స్పేస్ దొరికింది. వారి మేకోవర్ కొత్తగా ఉంది.


జాన్వీక‌పూర్ ఇందులో తంగం అనే ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో క‌నిపించింది. ఆమె లుక్స్ చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్‌, జాన్వీ మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. అనిరుద్ ర‌విచంద‌ర్ అద్భుత‌మైన సంగీతంతో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ఆయ‌న అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అనేలా ఉంది. ట్రైల‌ర్‌లో కొన్ని సీన్స్ అయితే క‌ళ్ల‌కువిందుగా ఉన్నాయి. ట్రైల‌ర్ చివ‌ర‌లో ఎన్టీఆర్ షార్క్‌పై ఉండి రైడ్ చేసే సీన్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంది. ఓవరాల్‌గా అయితే.. సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం.. సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయక తప్పదు.

Updated Date - Sep 10 , 2024 | 07:14 PM