Devara: దేవ‌ర నుంచి.. థ‌ర్డ్‌ సింగిల్ ‘దావుడి’ ఆప్డేట్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Sep 02 , 2024 | 08:52 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’ . ఈ సినిమా నుంచి తాజాగా మూడో పాట‌కు సంబంధించి ఆప్డేట్ వ‌చ్చింది.

devara

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). కొర‌టాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి పార్ట్‌కు సంబంధించి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ జ‌రుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను ఆగస్ట్ 5న విడుదల చేయగా స్వ‌ల్ప కాలంలో రికార్డులు తిర‌గ‌రాసింది. ఈ క్ర‌మంంలో తాజాగా మూడో పాట‌కు సంబంధించి ఆప్డేట్ వ‌చ్చింది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మొదటి సింగిల్ ‘ఫియర్ సాంగ్’ (Fear Song), గ‌త నెల‌లో రిలీజ్ చేసిన చుట్ట‌మ‌ల్లే అనే పాట‌లు సోష‌ల్ మీడియాలో సునామీ సృష్టించాయి. ఈ నేప‌థ్యంలో దావుడి అంటూ సాగే రొమాంటిక్ థ‌ర్డ్ సింగిల్‌ను సెప్టెంబ‌ర్‌4 బుధ‌వారం రోజున మూడవ సింగిల్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.


GWepRqbXoAAHKPt.jpeg

ఈ క్ర‌మంలో విడుద‌ల చేసిన పోస్టర్ సినీ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటుంది. అంతేకాదు పోస్టర్ చూస్తుంటే రాబోయే సాంగ్ ఓ రేంజ్‌లో ఉండబోతుందనే విష‌యం అర్థ‌మ‌వుతోంది. పోస్టర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హ్యాపీ మూడ్‌లో ఓ డ్యాన్స్ స్టెప్‌లో కనిపిస్తున్నారు. ఈ పాట ఈ సినిమాకే హైలెట్ అనేలా చిత్రీకరణ జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Updated Date - Sep 02 , 2024 | 08:52 PM