మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tamannaah Bhatia: హీరోయిన్ల మధ్య పోటీ అవసరం.. కానీ?

ABN, Publish Date - Jun 09 , 2024 | 08:26 PM

ఇతర రంగాల్లో పోటీ ఉన్నట్టుగానే చిత్రపరిశ్రమలో హీరోయిన్ల మధ్య పోటీ అవసరమని అగ్రనటి తమన్నా అభిప్రాయపడ్డారు. గత యేడాది సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ‘జైలర్‌’ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నా... ఈ యేడాది సుందర్‌ సి దర్శకత్వం వహించి హీరోగా నటించిన ‘అరణ్మనై-4’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో నటించిన మరో హీరోయిన్‌ రాశీఖన్నాతో ఆమెకు పోటీ నెలకొందనే వార్తలపై ఆమె స్పందించారు.

Tamannaah Bhatia

ఇతర రంగాల్లో పోటీ ఉన్నట్టుగానే చిత్రపరిశ్రమలో హీరోయిన్ల మధ్య పోటీ అవసరమని అగ్రనటి తమన్నా అభిప్రాయపడ్డారు. గత యేడాది సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ‘జైలర్‌’ (Super Star Rajinikanth Jailer) చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నా (Tamannaah Bhatia)... ఈ యేడాది సుందర్‌ సి (Sundar C) దర్శకత్వం వహించి హీరోగా నటించిన ‘అరణ్మనై-4’ (Aranmanai 4) చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో నటించిన మరో హీరోయిన్‌ రాశీఖన్నా (Raashii Khanna)తో ఆమెకు పోటీ నెలకొందనే వార్తలు వచ్చాయి. దీనిపై తమన్నా స్పందించారు.

Also Read- Gangs Of Godavari OTT: డేట్ ఫిక్సయింది.. లంకల రత్నం జాతర ఇక ఓటీటీలో!

ఆమె మాట్లాడుతూ.. ‘‘ఒక చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఒకరితో ఒకరిని పోల్చి మాట్లాడటం సహజం. కొందరు ఇద్దరు హీరోయిన్ల మధ్య పోటీ ఉందంటారు. కానీ, నా విషయానికి వస్తే, హీరోయిన్ల మధ్య పోటీ ఉండటం ఎంతో అవసరం. అయితే, ఈ పోటీ ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలి. సినిమా పరిశ్రమలో పోటీ ఉన్నప్పటికీ మనం.. మనంలాగే నటిస్తే చాలు. ‘అరణ్మనై-4’ చిత్రంలో నేను, రాశీఖన్నా (Heroine Raashii Khanna) ఒక పాటకు కలిసి డ్యాన్స్‌ చేశాం. అపుడు ఒకరికి ఒకరు అండగా నిలిచాం. అందువల్ల హీరోయిన్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం ఎంతో మంచిది’’ అని అభిప్రాయపడ్డారు.


ప్రస్తుతం తమన్నా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది. మరో వైపు నటుడు విజయ్ వర్మ (Vijay Verma)తో ఆమె డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. చూడాలి.. మరి ఏం జరుగుతుందో..

Read Latest Cinema News

Read more!
Updated Date - Jun 09 , 2024 | 08:26 PM