Tamannaah Bhatia : నా దృష్టి అంతా దానిపైనే!

ABN , First Publish Date - 2023-08-31T20:04:26+05:30 IST

మిల్కీబ్యూటీ తమన్నా(Tamannah), విజయ్‌ వర్మతో (Vijay Varma) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ (lust Stories) సిరీస్‌ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ సిరీస్‌ ప్రమోషన్స్‌లోనే ఈ విషయాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి ఈ జంట నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Tamannaah Bhatia : నా దృష్టి అంతా దానిపైనే!

మిల్కీబ్యూటీ తమన్నా(Tamannah), విజయ్‌ వర్మతో (Vijay Varma) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ (lust Stories) సిరీస్‌ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ సిరీస్‌ ప్రమోషన్స్‌లోనే ఈ విషయాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి ఈ జంట నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఇద్దరూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తమన్నా స్పందించారు. ప్రస్తుతం కెరీర్‌ చాలా బిజీగా ఉంది. ఈ సమయంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

2.jpg

తమన్నా మాట్లాడుతూ ‘‘గడిచిన ఐదు నెలల్లో నేను నటించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఆరు విడుదలయ్యాయి. ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతున్నారు.వాళ్లకి ఎప్పటికీ రుణపడి ఉంటా. వాళ్ల కోసం నేను శక్తిమేర కష్టపడతాను. నటిగా ప్రస్తుతం ఉత్తమమైన దశలో ఉన్నా. వైవిధ్యమైన పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. పెళ్లి విషయానికొస్తే వివాహ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం, గౌరవం ఉంది. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చేసుకుంటాను. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌ మీదే’ ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు’’ అని పేర్కొంది. ఇంకా చెబుతూ ‘‘గతంతో పోలిస్తే ఇప్పుడు నాలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడుతున్నా. ఒకప్పుడు ఇలా మాట్లాడితే నా తల్లిదండ్రులు ఏమనుకుంటారో అని భయపడేదాన్ని. గొప్ప విషయం ఏంటంటే నాలో మార్పు వచ్చినట్లే వాళ్ల ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది. నాకెంతో ఇష్టమైన వారి అనారోగ్యం తప్ప ఇప్పుడు నన్ను ఏ విషయమూ బాధించదు’ అని తెలిపింది.

Updated Date - 2023-08-31T20:04:26+05:30 IST