Tamannaah Bhatia: ఇప్పుడు కూడా బెడ్రూమ్ సీన్స్ గురించి చర్చ ఏంటి?
ABN , First Publish Date - 2023-06-29T17:42:42+05:30 IST
విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారం గురించి బయటపెట్టినప్పటి నుంచి తమన్నా విపరీతంగా ట్రెండింగ్‌లో ఉంది. దానికి తోడు తాజాగా ఆమె నటించిన ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ కూడా ఓ కారణం. ‘జీ కర్దా’లో లిప్‌లాక్, బెడ్రూమ్ సన్నివేశాల్లో హద్దులు మీరి నటించడంతో తమన్నా విమర్శలను ఎదుర్కొంటున్నారు.
విజయ్ వర్మతో (Vijay varma) ప్రేమ వ్యవహారం గురించి బయటపెట్టినప్పటి నుంచి తమన్నా(Tamannah) విపరీతంగా ట్రెండింగ్‌లో ఉంది. దానికి తోడు తాజాగా ఆమె నటించిన ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories2) వెబ్ సిరీస్ కూడా ఓ కారణం. ‘జీ కర్దా’లో లిప్‌లాక్, బెడ్రూమ్ సన్నివేశాల్లో హద్దులు మీరి నటించడంతో తమన్నా విమర్శలను ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ వేదికపై లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను అని ప్రకటించిన తమన్నా ఇప్పుడు అలాంటి సన్నివేశాలు శ్రుతిమించి నటించడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె నటించగా తాజాగా విడుదలైన ‘లస్ట్ స్టోరీస్2’లో కూడా తమన్నా బోల్డ్నెస్ పెరిగిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తమన్నా పాల్గొన్న ఓ ప్రమోషనల్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు.
‘‘ఇప్పుడు లిప్‌లాక్, బెడ్రూమ్ సన్నివేశాల గురించి నన్ను తెగ విమర్శిస్తున్నారు. కథకు అవసరం అనిపించడంతో ఆ సన్నివేశాల్లో నటించా. మనం ఏ రోజుల్లో ఉన్నాం... 2023లో కూడా ఇంకా బెడ్రూమ్ సన్నివేశాల గురించి విమర్శించడం ఏంటి’’ అని తమన్నా మండిపడ్డారు. ఓ నెల రోజుల క్రితం వరకూ ఇంకా పెళ్లి కాలేదని విమర్శించిన వాళ్లు ఇప్పుడు బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పగానే అతని గురించి విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ సమాజం ఎందుకు ఇలా తయారవుతోంది’ అంటూ ఘాటుగా మాట్లాడింది. అయితే నెటిజన్లు మాత్రం శ్రుతిమించిన శృంగారభరిత నటనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది తమన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో రజనీకాంత్ సరసన నటించిన జైలర్ ఆగస్టు 10న విడుదలకు సిద్ధమవుతోంది.