Devara: ‘దేవర’కు ఎవరెవరు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..
ABN , Publish Date - Sep 28 , 2024 | 09:40 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కలెక్షన్స్ మాత్రం రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్నాయి. డే 1కి ప్రపంచవ్యాప్తంగా రూ. 172 కోట్ల గ్రాస్‌ని సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్‌పై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎవరెవరు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ‘దేవర’ (Devara) కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ తొలి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించింది. తొలి రోజు తెలుగు రాష్టాల్లో రూ. 68 కోట్లతో ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 172 కోట్ల గ్రాస్‌ని సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా బడ్జెట్‌లో 26 శాతం మెయిన్ కాస్ట్ రెమ్యూనరేషన్లకే పోయిందట. తెలుగులోని అగ్ర నటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా నటించిన ఈ సినిమాలో ఎవరెవరికి ఎంతెంత రెమ్యూనరేషన్ ఇచ్చారనే దానిపై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల ప్రకారం..
Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ
రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచస్థాయి గుర్తింపును పొందిన తారక్ ఆ మూవీకి రూ. 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. కానీ ‘దేవర’ కోసం రూ.60 కోట్లు ఛార్జ్ చేసినట్లు సమాచారం. ఇక అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హిందీలో ఒక్కో సినిమాకి రూ. 3.5 కోట్లు తీసుకుంటుంది. కాగా ఈ సినిమాకి ఏకంగా రూ. 5 కోట్లు ఛార్జ్ చేసిందట. ఇక భైరగా విలన్ క్యారెక్టర్లో కనిపించిన సైఫ్ అలీ ఖాన్ రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రూ. 1.5 కోట్లు ఛార్జ్ చేయగా, శ్రీకాంత్ రూ. 50 లక్షలు.. మురళీ శర్మ, నరైన్‌లు చెరో రూ. 40 లక్షలు ఛార్జ్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది.
సోలో హీరోగా ఎన్టీఆర్‌ని (NTR) తెరపై చూసి ఆరేళ్లు అవుతోంది. అభిమానులు ఆయన చిత్రం కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూశారు. ‘దేవర’తో (Devara) ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ సోలో రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లును రాబడుతోంది. రిలీజ్‌కు ముందు టికెట్ బుకింగ్స్‌లోనూ పలు రికార్డులను సొంతం చేసుకుంది. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మంచి స్థానంలో ఉంది. మొదటి రోజు కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ‘దేవర’ రెండో స్థానంలో ఉందని చెబుతున్నారు. వీకెండ్, దసరా హాలీడేస్ కలిసొచ్చాయి కాబట్టి.. టాక్ ఎలా ఉన్నా, బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు.