Telugodu: చంద్రబాబు బయోపిక్.. యూట్యూబ్‌లో సంచలనం
ABN, Publish Date - May 09 , 2024 | 02:01 PM
తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయనొక విజనరీ. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు, భావి తరాల భవిష్యత్తుకు వేసిన బాటలు ఒక హిస్టరీ. తెలుగు జాతి ఉన్నతికి కృషి చేసిన ఆయన జీవితంపై ఓ బయోపిక్ తెరకెక్కింది. నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘తెలుగోడు’. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది.
తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). ఆయనొక విజనరీ. ముఖ్యమంత్రిగా (Chief Minister) ఆయన చేపట్టిన సంస్కరణలు, భావి తరాల భవిష్యత్తుకు వేసిన బాటలు ఒక హిస్టరీ. తెలుగు జాతి ఉన్నతికి కృషి చేసిన ఆయన జీవితంపై ఓ బయోపిక్ (Chandrababu Biopic) తెరకెక్కింది. నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘తెలుగోడు’ (Telugodu). ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో సినిమా తెరకెక్కింది. కథ, కథనం, మాటలు అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో డాక్టర్ వెంకీ మేడసాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బయోపిక్‌ను డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో విడుదల చేశారు. గురువారం (మే 9) ఉదయం విడుదలైన ఈ సినిమా సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. (Telugodu Released in Youtube)
*Elections 2024: టాలీవుడ్‌లో ముఖ్యమంత్రులుగా చేసిన నటులు వీరే..
చిత్రసీమలో ఎటువంటి నేపథ్యం గానీ, అనుభవం గానీ లేని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ వెంకీ మేడసాని (Dr Venky Medasani)... తొలి ప్రయత్నంలో తెలుగు ప్రజానీకంపై తనదైన ముద్ర వేసిన చంద్రబాబు బయోపిక్ తీసి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుగారి జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. నన్ను ఆ అంశం ఎంతగానో ఆకర్షించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 5 దశాబ్దాలు గడిచినా పల్లెటూరి ప్రజల జీవితాలు మారలేదు. చంద్రబాబుగారు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద బిల్డింగ్స్ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామాజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్ మీదే ఈ సినిమా తీశా. ప్రతి ఒక్కరూ ఈ బయోపిక్ చూడాలని కోరారు. (Chandrababu Biopic Telugodu Creates History in Youtube)
అభివృద్ధి అందరినీ ఒక్కటి చేస్తుందనే అంశం మీద తాను సినిమా తీశానని, నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎలా ఆలోచించారు? అనేది ‘తెలుగోడు’ మెయిన్ కాన్సెప్ట్ అని డాక్టర్ వెంకీ మేడసాని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ప్రపంచానికి తెలియని ఓ ప్రాంతాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలని భావించిన ఓ నాయకుడి కథ మా సినిమా. ఐదారు నెలల క్రితం సినిమా తీయాలని నేను అనుకున్నా. కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిశా. కొందరు పెద్దలనూ కూడా కలిశా. రాజకీయ నాయకుడిపై సినిమా తీస్తే విజయం సాధించదని వారించారు. పాయింట్ నచ్చి సినిమా తీశా. చిన్న ఆర్టిస్టులతో పెద్ద సినిమా తీశాం. కంటెంట్ మీద నమ్మకంతో ప్రజలకు చేరువ అవుతుందని తీశాను. ఎక్కువ మంది ప్రజలకు సినిమా చేరాలనే ఉద్దేశంతో యూట్యూబ్‌లో రిలీజ్ చేశాం. నేను సినిమా తీయగలననే కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఇచ్చిందని చెప్పారు. చంద్రబాబు పాత్రలో వినోద్ నటించిన ‘తెలుగోడు’ చిత్రానికి మల్లిక్ చంద్ర సినిమాటోగ్రఫీ, రాజేష్ రాజ్ సంగీతం అందించారు.
Read Latest Cinema News