Devara: డబ్బులిచ్చి ‘జై’ కొట్టించుకున్నారా..

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:43 PM

ముంబైలో జరిగిన ‘దేవర’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంపై అక్కడి జర్నలిస్ట్ ఒకరు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని ముంబైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

Devara Trailer Launch Event

ముంబైలో జరిగిన ‘దేవర’ (Devara) ట్రైలర్ లాంచ్ కార్యక్రమంపై అక్కడి జర్నలిస్ట్ ఒకరు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం మేక‌ర్స్ ‘దేవర’ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అయితే ఈ కార్యక్రమంపై బాలీవుడ్ జర్నలిస్ట్ ఒకరు వివాదస్పద కామెంట్స్ చేశారు. (Devara Trailer Launch Event)

Also Read- Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేస్‌లో కీలక పరిణామం.. హేమకు షాక్


ఈ వేడుక జరుగుతున్నంత సేపు ‘జై ఎన్టీఆర్’ అనేలా నినాదాలు చేయడానికి కొంతమంది వ్యక్తులకు డబ్బు చెల్లించి తీసుకువచ్చారని చెబుతూ సదరు జర్నలిస్ట్ (Bollywood Journalist) సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘దేవర’ సినిమా ప్రమోషన్ పేరుతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ముందు సీట్లను కేటాయించి, జర్నలిస్ట్‌లను వెనక్కు నెట్టారని ఇందులో వెల్లడించారు. బాలీవుడ్ జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు నడుస్తున్నాయి. ‘దేవర’ టీమ్ చర్యలపై నెటిజెన్స్, అభిమానుల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ‘దేవర’ టీమ్ సౌత్ సినిమా ఇండస్ట్రీ పరువు తీస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Sep 12 , 2024 | 12:49 PM