Jr Ntr: దేవరపై.. ఎన్టీఆర్‌కు అనుమానమా..! అందుకే అలా అన్నాడా
ABN , Publish Date - Sep 11 , 2024 | 12:54 PM
జూ.ఎన్టీఆర్ సుమారు ఆరేండ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిత్రం దేవర. అయితే ఈ చిత్రం ఏ ముహుర్తానా మొదలు పెట్టారో గానీ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ విషయంలోనూ ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి.
జూ.ఎన్టీఆర్ (Jr Ntr) సుమారు ఆరేండ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిత్రం దేవర (Devara Part 1). RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ మూవీ కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ దేవర (Devara Part 1) చిత్రం ఏ ముహుర్తానా మొదలు పెట్టారో గానీ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ విషయంలోనూ ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటల విషయంలో భిన్న అభిప్రాయాలు రాగా తాజాగా విడుదలైన ట్రైలర్ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం ఇప్పుడు బాగా చర్చనీయాంశం అవుతుంది.
దేవర పార్ట్ 1(Devara Part 1) ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయని టీమ్ వెయిట్ చేశారు. కానీ ట్రైలర్ చూశాక జూ. ఎన్టీఆర్ హార్ట్ కోర్ అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. ముందు నుంచి హైప్ ఇచ్చినంత కంటెంట్ ట్రైలర్‌లో ఏమాత్రం కనిపించడం లేదని ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ మొదలుకొని, ట్రైలర్ ను కట్ చేసిన విధానం పాన్ ఇండియా సినిమా స్దాయికి పూర్తి విరుద్దంగా ఉందనే రెస్పాన్స్ వస్తోంది.
అసలు దేవర Devara Part 1 మోస్ట్ వయోలెంట్ మూవీ అని ప్రచారం చేసిన టీమ్, ఎన్టీఆర్ (Jr Ntr) పాత్రను అంత బలంగా ఎక్కడా చూపించి లేదని, ఆ రోల్‌కు ఎన్టీఆర్ సూట్ అయినట్లు కనిపించింది కూడా లేదనే పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ముంబై ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తనకు దేవర విషయంలో దడగా ఉందని ఆరేళ్ల అనంతరం సోలో హీరోగా చేస్తున్న సినిమా కావటంతో.. దేవర ఫలితం పై ఆసక్తి వెయిట్ చెస్తున్నానంటూ మాట్లాడటం అభిమానులకు మరింత ఆందోళనను కలిగించింది.
అయితే దేవర Devara Part 1 సినిమా లాస్ట్ 40 నిమిషాలు బాగుంటుందంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ. ట్రైలర్‌లోఅంత స్టప్ ఉన్నట్లు కనిపించింది లేదు. ఓవరాల్ గా ఎన్టీఆర్ (Jr Ntr) స్పీచ్‌ను విన్నవారంతా.. తారక్ ఏంటి ఇంత డౌట్ ఫుల్‌గా మాట్లాడుతున్నాడు.. దేవర రిజల్ట్ పై అతనికి అనుమానమా, ఫలితాన్ని ముందే ఐహించి ప్రిఫేర్ అవుతున్నాడా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.