Devara: ‘దావుడి’ పాటని అందుకే తీసేశారా..

ABN , Publish Date - Sep 27 , 2024 | 10:17 PM

ఎన్టీయార్, జాన్వీ కపూర్ తమ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టిన ‘దావుడి’ పాట సినిమా నుండి ఎందుకు తొలిగించాల్సి వచ్చిందో తెలుసా? ఈ పాట కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ సినిమాలో ఆ పాట లేకపోవడంతో బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఈ పాట తీసేయడానికి కారణం ఏంటనే విషయానికి వస్తే..

Devara Movie Still

శుక్రవారం విడుదలైన ‘దేవర’ (Devara) ఫస్ట్ పార్ట్‌లో ‘దావుడి’ పాట లేకపోవడం అభిమానులని షాక్‌కి గురిచేసింది. అయితే ఈ విషయం గత పది రోజుల నుంచి చర్చకు వచ్చినా.. చివరి నిమిషంలో యాడ్ చేస్తారేమో అని అభిమానులు వేచి చూశారు. కానీ.. చివరికి నిరాశే మిగిలింది. ఎన్టీయార్, జాన్వీ తమ పెర్ఫామెన్స్‌లతో అదరగొట్టిన ఈ పాట సినిమా నుండి ఎందుకు తొలిగించాల్సి వచ్చిందో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. (Daavudi Song)

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ

ఈ సినిమా హ్యూజ్ ఎమోషన్స్‌తో సాగుతోంది. ఇలాంటి సినిమాలో భావోద్వేగాలు డైవర్ట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి సాంగ్స్‌ని ట్రిమ్ చేయడమే కరక్ట్ అని మేకర్స్‌కి అనిపించొచ్చు. అందుకే కఠిన నిర్ణయమైనా ఈ సాంగ్‌ని తొలిగించాల్సి వచ్చింది. సెన్సార్‌కి వెళ్లేముందు ట్రిమ్ చేసిన ఏడు నిమిషాల ఫుటేజీ‌లోనే ఈ సాంగ్‌ని తొలిగించినట్లు సమాచారం. కనీసం ఎండ్ కార్డ్స్ పడే సమయానికి ఈ సాంగ్ వేస్తారనుకున్నా ఓపెన్ ఎండింగ్‌తో సీక్వెల్‌కి స్పేస్ ఉన్న కథ కాబట్టి అక్కడ ఈ సాంగ్ జోడించలేకపోయారు. అయితే సినిమా రెండు మూడు వారాల రన్ తర్వాత ఈ సాంగ్‌ని జోడించే అవకాశం ఉందని కొందరు ఆశపడుతున్నారు. కాగా ఈ సాంగ్ తీసేయడం మంచి నిర్ణయమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


Devara-Daavudi-Song.jpg

ఏదిఏమైనప్పటికీ ఫస్ట్ వీక్ కాబట్టి ఇలాంటి ట్రిమ్మింగ్ సాధారణమే. ఇక సినిమాలోని ఇతర పాటలకు ఎన్టీయార్ (Jr NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) స్టెప్పులకు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. ప్రస్తుతానికి మొదటి రోజు కావడంతో సినిమా భారీ ఓపెనింగ్స్ మంచి కలెక్షన్స్‌తో ముందుకు సాగుతోంది. మరోవైపు హిందీలోనూ 2 గంటల 50 నిమిషాల రన్‌ టైమ్‌‌‌ని ఏడు నిమిషాలు ట్రిమ్ చేసి 2 గంటల 43 నిమిషాలకు కుదించారు. తెలుగు నటీనటుల సోలో ఇంట్రడక్షన్ సన్నివేశాలతో మరికొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 10:17 PM

Devara : సెకెండ్‌ సింగిల్‌..  నీ కోసం వయసు వాకిలి కాసా!

Devara Release Trailer: సంద్రం ఎరుపెక్కి ఎర్ర సముద్రం అయినట్టు...

Devara Part 1: ‘దేవర’.. ఫియర్ సాంగ్ వీడియో

Devara Part 1: ‘దేవర పార్ట్ 1’ థియేట్రికల్ ట్రైలర్

Devara Event: దేవర ఈవెంట్‌ రద్దు.. నిర్వాహకుల క్షమాపణ