Tejus Kancherla: టీజర్, ట్రైలర్లతోనే కథేంటో హింట్ ఇచ్చాం.. ఎందుకంటే

ABN , Publish Date - Sep 06 , 2024 | 09:29 PM

‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో హీరోగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌. ఆయన హీరోగా చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 7న రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను హీరో మీడియాకు తెలియజేశారు.

Hero Tejus Kancherla

‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో హీరోగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌ (Tejus Kancherla). ఆయన హీరోగా చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’ (Uruku Patela). ‘గెట్ ఉరికిఫైడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి స్పెషల్‌గా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. ఈ క్రమంలో హీరో తేజస్ కంచర్ల మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

Also Read- Nithiin: తండ్రైన నితిన్‌.. షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు

‘‘హుషారు తర్వాత చాలా కథలు విన్నాను. ఏదైనా కొత్తగా ఉండే కథలను చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఎన్నో కథలను విన్న తర్వాత ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది. వివేక్ ఈ పాయింట్‌ను చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి కథను రాసుకున్నాం. అలా ఈ మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాం. కథ అయితే రెడీ అయింది.. స్క్రిప్ట్ బాగా వచ్చింది. చాలా మంది నిర్మాతల వద్దకు వెళ్లాం. కథను వినిపించాం. అందరూ బాగానే ఉందని అన్నారు. కానీ, నా మీద అంత బడ్జెట్ పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్లు కూడా రైటే. ఫైనల్‌గా ఈ కథను మా నాన్న విన్నారు. ఆయనకు నచ్చడంతో ఈ సినిమాను నేనే నిర్మిస్తానంటూ ముందుకు వచ్చారు.


తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉంటుంది. యాస అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలానే ఉంటుంది. నేను పుట్టి పెరిగింది హైద్రాబాద్‌లోనే కాబట్టి యాసతో పెద్ద ప్రాబ్లం ఏమీ రాలేదు. టీజర్, ట్రైలర్ చూస్తే కథ ఏంటన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం ఉన్న తరుణంలో కథ ఏంటి? సినిమా ఎలా ఉంటుంది? అనేది ఆడియెన్స్‌కు ముందే హింట్ ఇస్తే బెటర్ అని నా ఉద్దేశం. అందుకే మా టీజర్, ట్రైలర్ ద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతోందనేది ముందే కాస్త చెప్పేశాం. (Tejus Kancherla About Uruku Patela)

Also Read- Tollywood - Vinayaka Chavithi: దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. కరుణించయ్యా దేవా..

ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమా అంతా హీరోయిన్ చుట్టే తిరుగుతుందని అనిపిస్తుంది. కానీ సినిమాలోకి వచ్చాక వేరేలా ఉంటుంది. ‘ఉరుకు పటేల’ అనే టైటిల్ ఏంటి? ఎందుకు ఉరకడం? అనేది జస్టిఫై చేసేలా సినిమా ఉంటుంది. ఆద్యంతం నవ్వించేలానే ఈ సినిమాని తెరకెక్కించాము. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఉత్తరాఖండ్‌కి చెందిన అమ్మాయి. ఆమె చేసిన ఓ రీల్ చూసి పిలిపించి.. వర్క్ షాప్స్ పెట్టాం. ఆమె చెప్పిన టైంకి వచ్చి, చెప్పినట్టుగా నటించారు. ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. లాక్డౌన్‌లో ఉన్న టైంలో మూఢనమ్మకాల గురించి వార్తలు ఎక్కువగా చదివాను. అలా కొన్ని ఘటనల చుట్టూ ఈ కథను అల్లుకున్నాను. థ్రిల్లర్, కామెడీ జానర్లో ఈ మూవీని పూర్తి ఎంటర్టైన్మెంట్‌గా తీశాం.


Tejus-Kancharla.jpg

ఈ చిత్రం సక్సెస్ అయ్యి డబ్బులు వస్తే.. ఆ తర్వాత మంచి కథలు దొరికితే కచ్చితంగా నిర్మిస్తాను. కానీ ఈ సారి మాత్రం నిర్మిస్తూ, నటించను. ఆ రెండూ ఒకేసారి చేయడం చాలా కష్టం. ఈ సినిమాతో నాకు అది అర్థమైంది. ఫ్యూచర్‌లో డైరెక్షన్ చేయాలని కోరిక ఉంది. నా వద్దకు వచ్చే కథల్లో అవసరమైతే ఇన్‌పుట్స్ ఇస్తాను. నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. నాకు పాత్ర నచ్చితే, అందులో మజా ఉందనిపిస్తే స్పెషల్ రోల్స్ అయినా చేస్తాను..’’ అని చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - Sep 06 , 2024 | 09:29 PM