Uruku Patela: ‘ఉరుకు పటేల’ ఫస్ట్ లుక్.. గెట్ ఉరికిఫైడ్

ABN , Publish Date - Jul 18 , 2024 | 02:01 PM

‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన నటుడు తేజ‌స్ కంచ‌ర్ల‌. ఇప్పుడు మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తేజస్ చేస్తున్న ‘ఉరుకు పటేల’ చిత్రం.. ప్రేక్షకులకు ఆయనని మరింత దగ్గర చేస్తుందని ఎంతో నమ్ముతున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘గెట్ ఉరికిఫైడ్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌.

Uruku Patela Movie Still

‘హుషారు’ (Husharu) వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన నటుడు తేజ‌స్ కంచ‌ర్ల‌ (Tejus Kancherla). ఇప్పుడు మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తేజస్ చేస్తున్న ‘ఉరుకు పటేల’ (Uruku Patela) చిత్రం.. ప్రేక్షకులకు ఆయనని మరింత దగ్గర చేస్తుందని ఎంతో నమ్ముతున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘గెట్ ఉరికిఫైడ్’ (Get Urikified) అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ఈ ఫస్ట్ లుక్‌తో పాటు చిత్ర వివరాలను తాజాగా మేకర్స్ తెలియజేశారు. (Uruku Patela Movie First Look)

Also Read- Game Changer: అప్డేట్స్ లేవ్.. లీక్స్‌తోనే పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

ముందుగా ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. తేజ‌స్ కంచ‌ర్ల ప‌రిగెడుతుంటే అత‌ని వెనుక క‌త్తిని ఎవ‌రో విసిరేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రో వైపు మంగ‌ళ‌సూత్రం, పోస్ట‌ల్ బ్యాలెట్ పేప‌ర్‌, పాల క్యాన్ అన్నీ క‌నిపిస్తున్నాయి. ఇది గ్రామీణ నేప‌థ్యంలో భావోద్వేగాల ప్ర‌ధానంగా సాగే చిత్ర‌మ‌ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తిని కలిగించేలా ఉంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయనే దానికి సింబాలిక్‌‌గా పోస్టర్‌ని డిజైన్ చేశారు. అలాగే ఈ టైటిల్‌కు మాదిరిగానే.. సినిమా కూడా ఉరుకే ఉరుకు అన్నట్లుగా ఉంటుందనేలా ఈ ఫస్ట్ లుక్ క్లారిటీ ఇచ్చేస్తోంది. (Uruku Patela Movie)


Uruku-Patela-First-Look.jpg

లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి (Vivek Reddy) ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను (Kancherla Bala Bhanu) ఈ ‘ఉరుకు పటేల’ సినిమాను నిర్మిస్తున్నారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యిందని.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని, త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని ఈ సందర్భంగా చిత్రయూనిట్ తెలియ‌జేసింది.

Read Latest Cinema News

Updated Date - Jul 18 , 2024 | 02:01 PM