Uruku Patela: ‘ఉరుకు పటేల’కు భలే ఛాన్స్..

ABN , Publish Date - Sep 04 , 2024 | 10:44 PM

‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచెర్ల‌. ఆయన హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’ ఈ సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. ఈ సినిమాకు ఇప్పుడు భలే ఛాన్స్ వరించింది. అదేంటంటే..

Uruku Patela Movie Still

‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచెర్ల‌ (Tejus Kancharla). ఆయన హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’ (Uruku Patela) ఈ సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. ఇప్పుడీ సినిమాకు అనుకోకుండా అదృష్టం కలిసొచ్చింది. అదేంటని అనుకుంటున్నారా..

వినాయక చవితి స్పెషల్‌గా ఈ వారం నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. తమిళ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ గురువారం విడుదలవుతుండగా.. సెప్టెంబర్ 6న ‘35 చిన్న కథ కాదు’ విడుదలకానుంది. ఆ మరుసటి రోజు ‘ఉరుకు పటేల’ సినిమాతో పాటు, దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న సుహాస్ సినిమా ‘జనక అయితే గనక’ సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో ‘జనక అయితే గనక’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘ఉరుకు పటేల’ సినిమాకు లైన్ క్లియరైంది. సెప్టెంబర్ 7న ‘ఉరుకు పటేల’ సినిమా ఒక్కటే విడుదలకాబోతోంది. (Uruku Patela Ready to Release)


Tejas.jpg

ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ గమనిస్తే.. ఈ సినిమా ఓ సరికొత్త ప్రేమకథను ప్రజంట్ చేయబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది. హీరోకి పెళ్లి వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి కావ‌టం లేద‌ని బాధ ఎక్కువ అవుతుంటుంది. అందుకు కార‌ణం.. త‌నేమీ చ‌దువుకోడు.. కానీ బాగా చ‌దువుకున్న పిల్ల‌నే పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అత‌ని ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్టే.. ఓ అంద‌మైన హీరోయిన్ అత‌న్ని ప్రేమిస్తుంది. చాలా మంది చ‌దువుకున్న అమ్మాయిల‌కు న‌చ్చ‌ని హీరోని హీరోయిన్ మాత్రం ఎందుకు ప్రేమించిందా! అనేది చాలా మందిలో ఉండే ప్ర‌శ్న‌. కానీ.. క‌థ‌లో అస‌లు ట్విస్ట్ అదే. మ‌న హీరోయిన్‌లో మ‌రో కోణం బ‌య‌ట‌కు వ‌స్తుంది. దెబ్బ‌కు హీరో భ‌య‌ప‌డ‌తాడు.. ఏం చేయాలో తెలియ‌క పారిపోవాలనుకుంటాడు.. ఇంత‌కీ హీరోయిన్ ఏం చేసింది.. ఆమెను చూసి హీరో ఎందుకు భ‌య‌ప‌డ్డాడు.. చివ‌ర‌కు ఏమైంద‌నేది తెలుసుకోవాలంటే సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ కాబోతున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Updated Date - Sep 04 , 2024 | 10:44 PM