Niharika Konidela: కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్ తీసిన సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’.. జాతరే!

ABN , Publish Date - Aug 08 , 2024 | 09:32 PM

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. గురువారం చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు.

Niharika Konidela

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu). ఈ సినిమాకు య‌దు వంశీ (Yadhu Vamsi) ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ ఏర్పడేలా చేశాయి. ఈ క్రమంలో గురువారం చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ..

Also Read- Thriller Movies: ఆహా ఓటీటీలోకి వచ్చిన మరో రెండు ఎక్సయిటింగ్ థ్రిల్లర్స్

‘‘ఈ ‘కమిటీ కుర్రోళ్ళు’ కథ విన్నాక ఈ చిత్రంలో నా పేరు మాత్రం కనిపించాలని అనుకున్నాను. ఫీచర్ ఫిల్మ్ చేయాలని అనుకున్న టైంలో అంకిత్ ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. మ్యూజిక్‌తో పాటుగా ఈ కథను నాకు వినిపించారు. అనుదీప్ అప్పటికే మ్యూజిక్ చేసేశారు. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర ఎక్స్‌పీరియెన్స్ చేయలేదు. కానీ నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. నెరేషన్ అద్భుతంగా ఇచ్చాడు. ఓటీటీలో అయినా థియేటర్లో అయినా సినిమా మేకింగ్ ప్రాసెస్ ఒకటే. అందుకే ఈ కథను ఎలాగైనా నిర్మించాలని నేను ఫిక్స్ అయ్యాను.


Niharika-Konidela.jpg

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నాడు యదు వంశీ. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు కూడా ఇందులో ఉన్నాయి. వంశీ.. కళ్యాణ్ బాబాయ్ (Pawan Kalyan) అభిమాని. 2019 ఎన్నికల ప్రచార టైంలో జరిగిన విషయాలను కూడా ఇందులో తన స్టైల్లో, కాస్త సెటైరికల్‌గా చూపించారు. టాలెంట్ మాత్రమే కాదు.. క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారని చిరంజీవి (Chiranjeevi) పెదనాన్న చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ నేను వంశీలో చూశాను. ఆయన సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మా నాన్నకి (Nagababu) కూడా వంశీ నెరేషన్ ఇచ్చారు. మామూలుగానే మా నాన్నకి నచ్చకపోతే వెంటనే లేచి వెళ్లిపోతారు. కానీ వంశీ చెప్పిన కథ మా నాన్నకి కూడా చాలా బాగా నచ్చింది.

మా అన్నా, వదినలు (Varun Tej and Lavanya) సినిమాను చూశారు. వాళ్లకి సినిమా చాలా నచ్చింది. బయటి వాళ్ల పొగడ్తలు, క్రిటిసిజం పట్టించుకోను. మా అన్న ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పేస్తుంటారు. ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు. సెన్సార్ వాళ్లకి కూడా సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ను ముందే ఫిక్స్ చేశారు. నాకు కమిటీ కుర్రోళ్లు అంటే ఏంటో తెలియదు. పండుగలు, పబ్బాలు, గొడవలు ఇలా ఏది ఉన్నా కమిటీ కుర్రాళ్లే ముందుంటారని వంశీ చెప్పారు.

Also Read- Raj Tarun - Lavanya Case: రాజ్ తరుణ్‌కు భారీ ఊరట


అంతా కొత్త వాళ్లుంటే.. బిజినెస్‌కు ఇబ్బంది అవుతుందని అన్నాను. కథ వినండి.. విన్న తరువాత చెప్పండని వంశీ అన్నారు. ప్రసాద్ ఒక్కడే అందరికీ తెలిసిన వ్యక్తి. వాళ్లంతా కూడా సినిమాతో మూడేళ్లుగా ప్రయాణం చేశారు. ఎవ్వరూ కూడా సెట్స్ మీద డైలాగ్ పేపర్ పట్టుకోలేదు. నేను వాళ్లని ఎంచుకోలేదు.. వాళ్లే నన్ను ఎంచుకున్నారు. ప్రతీ ఒక్క పాత్రకు మంచి సీన్స్ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సీన్‌లో షైన్ అవుతారు. ఇక అనుదీప్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ఆయన ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఈ మూవీకి ఆయనే ప్రధాన బలం.


Mega-Daughter.jpg

ముద్దపప్పు ఆవకాయ్ టైంలో నేను నటించాను. ఆ టైంలో నేను అందులో డబ్బులు కూడా పెట్టాను. అదే ప్రొడక్షన్ హౌస్ అయింది. కావాలని నిర్మాత అవ్వలేదు. అలా అయిపోయానంతే. నాకు నటించడమే ఇష్టం. మంచి కథలు, కాన్సెప్ట్‌లు, స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తా. పాత్ర బాగుంటే మిగతా అంశాల గురించి పెద్దగా పట్టించుకోను. చిన్న పాత్ర అని, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ బాగుండి.. పాత్ర నచ్చితే సినిమాల్లో నటిస్తాను. వారసత్వం ఉంది కదా అని సినిమాల్లోకి వస్తే సక్సెస్ అవ్వలేరు. సినిమా అంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడాలి. అప్పుడే విజయం సాధించగలరు. (Niharika About Committee Kurrollu)

ఈ సినిమాలో పదకొండు మంది అబ్బాయిల క్యారెక్టర్లో నన్ను నేను ఊహించుకొన్నాను. సినిమాను చూసే ప్రతీ ఆడియెన్ ఏదో ఒక క్యారెక్టర్‌తో ట్రావెల్ చేస్తారు. ప్రతీ ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు’’ అని చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - Aug 08 , 2024 | 09:32 PM

Committee Kurrollu: నిహారిక‌ ‘కమిటీ కుర్రోళ్ళు’.. జయప్రకాష్ నారాయణ వ‌దిలిన ‘గొర్రెలా..’ పాట

Committee Kurrollu: ‘ఆ రోజులు మళ్లీ రావు’ లిరికల్ సాంగ్

Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్లు’.. ఈ మూవీని థియేటర్లలో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది

Committee Kurrollu:  ‘కమిటీ కుర్రోళ్ళు’ నుంచి హుషారైన పాట 

Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్లు’లోని ‘ప్రేమ గారడీ’ లిరికల్ సాంగ్