Natural Star Nani: సినిమా చూడాలనే థాట్‌ని ట్రిగ్గర్ చేయడం చాలా పెద్ద పని
ABN, Publish Date - Aug 27 , 2024 | 06:29 PM
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో SJ సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను హీరో నాని మీడియాకు తెలియజేశారు.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో SJ సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య (DVV Danayya), కళ్యాణ్ దాసరి (Kalyan Dasari) హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 29న గ్రాండ్‌గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను తాజాగా హీరో నాని మీడియాకు తెలియజేశారు.
మీరు సినిమాకు, అలాగే ఆ సినిమా ప్రమోషన్స్‌కు ఒకేలా ఎఫర్ట్ పెడుతున్నారు.. అవసరమంటారా?
చాలా అవసరం.. అంత ఎఫర్ట్ పెట్టాలని నాకు ఈ మధ్యే అర్థమైంది. ఇంతకుముందు నాకు కూడా ఆ థాట్ లేదు. సినిమాలో ఉన్న కంటెంట్ సినిమాని చూసుకుంటుందనే ఫీలింగ్ వుండేది. నిజంగానే కంటెంట్ సినిమాని చూసుకుంటుంది. అయితే అది రిలీజ్ అయిన తర్వాత. సినిమా రిలీజ్‌కు ముందు పాజిటివిటీ, అందరికీ రీచ్ చేయడం మన బాధ్యత. రెగ్యులర్‌గా సినిమాని ఫాలో అయ్యేవారికి సినిమా గురించి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. అలాకాకుండా రెగ్యులర్‌గా ఫాలోకాని వారు, పనుల్లో బిజీగా వున్నవారి దగ్గరకి మన సినిమా ఇన్ఫర్మేషన్, ఐడియా తీసుకువెళ్ళాలంటే అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేయాలి. ఆసక్తిని కలిగించాలి. సినిమా చూడాలనే థాట్‌ని ట్రిగ్గర్ చేయడం చాలా పెద్ద పని. అందుకే అంత ఎఫర్ట్ పెడుతున్నాం.
ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన పాయింట్ ఏమిటి?
ట్రైలర్‌లో ఏదైతే చూపించామో అది నాకు బాగా ఎక్సయిట్ చేసింది. దాని నెరేటివ్ ఎలా ఉంటుందనేది మీరు సినిమాలో చూడాలి. ఐడియాని ట్రైలర్‌లో చెప్పాం. ఆ ఐడియాని ఎలా ఎగ్జిక్యూట్ చేశామనేది తెలియాలంటే సినిమా చూడాలి. (Natural Star Nani Interview)
ఈ సినిమాలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన పార్ట్ ఏమిటి?
ఛాలెంజింగ్ అంటూ ఏమీ లేదు. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. జనరల్‌గా నా సినిమాలన్నింటిలో తెలియని ఒక బరువుని మోస్తుంటాను. అది ఈసారి ఎస్.జె. సూర్య గారిమీద, వివేక్ మీద వుంది. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాను. పెర్ఫార్మెన్స్ పరంగా ఎస్.జె. సూర్య, ప్రియంక, మురళీశర్మ.. ఇలా అందరిపై భారం వుంది.
ఎస్.జె. సూర్యతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
ఎస్.జె. సూర్య గారితో కలిసి పెర్ఫార్మ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆయనకి చాలా అండర్ స్టాండింగ్ వుంటుంది. పెర్ఫార్మెన్స్‌లో ఆయన నుంచి ఒక కొత్త పెర్స్పెక్టివ్‌ని నేర్చుకోవచ్చు. ఆ రోల్‌కి ఆయన తప్పితే మరో చాయిస్ లేదు. డబ్బింగ్ దాదాపు ఏడు రోజులు చెప్పారు. అద్భుతంగా వచ్చింది. తన డబ్బింగ్ కోసం ప్రతి ఒక్కరూ మరో రెండుసార్లు సినిమా చూస్తారు. ‘సరిపోదా శనివారం’ చాలా మంచి కథ. అడ్రినలిన్ పంపింగ్ మూమెంట్స్ వుంటాయి. కథ ప్రకారం ఆ అడ్రినలిన్ పంపింగ్ వందశాతానికి తీసుకెళ్ళాం. సినిమా చాలా ఆర్గానిక్‌గా కుదిరింది. థియేటర్స్‌లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. (Nani About Saripodhaa Sanivaaram)
జేక్స్ బిజోయ్ మ్యూజిక్ గురించి?
ఈ సినిమా రేసీ ఫిలిం. నెరేటివ్ కూడా రేసీగా వుంటుంది. సినిమా పరిగెడుతుంటుంది. ఇలాంటి పరిగెడుతున్న సినిమాకి ఏం స్కోర్ చేస్తాడనే ఒక క్యురియాసిటీ వుండేది. నిన్న వెళ్లి ఆర్ఆర్ చూశా. బేసిగ్గా సినిమాల్లో హీరోకి ఇంట్రో సాంగ్ వుంటుంది. తర్వాత మేలోడీలు, ఎమోషనల్ సాంగ్స్ వస్తాయి. అందులో బిట్స్‌ని ఆర్ఆర్‌గా పంప్ చేస్తుంటారు. కానీ జేక్స్.. మొత్తం సినిమాని హీరో ఇంట్రో సాంగ్‌లా కొట్టాడు. తన మ్యాజిక్ 29న చూస్తారు.
‘అంటే సుందరానికీ’ రిలీజ్ తర్వాత మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారని వివేక్ చెప్పారు?
‘అంటే సుందరానికీ’ చాలా మందికి ఫేవరేట్ సినిమా. ఆ జోనర్‌ని ఇష్టపడే ఆడియన్స్‌కి అది ఆల్ టైమ్ ఫేవరేట్‌లో ఒకటి. అయితే రిలీజైన రోజుల్లో ఆ సినిమా రన్ టైమ్, స్క్రీన్‌ప్లే విషయంలో కొన్ని కామెంట్స్ వినిపించాయి. అలాంటి సమయంలో ‘నేను సరిగ్గానే చేశానా?’ అనే డౌట్స్ తనలో ఉండేవి. ఎప్పుడూ బాధ్యత తీసుకున్న వారికి ఇలాంటి డౌట్స్ వుండటం సహజం. అలాంటి సమయంలో తన బలాన్ని గుర్తు చేస్తూ నేను తన పక్కన ఒక బ్రదర్‌లా వున్నాను. తను టెర్రిఫిక్ డైరెక్టర్. ‘సరిపోదా శనివారం’కి రన్ టైం, స్క్రీన్‌ప్లే పర్ఫెక్ట్. మేము అనుకున్న ఐడియా, సెటప్, పే ఆఫ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. మేము ఎలా చేయాలని అనుకున్నామో అలా చేశాం.
సినిమాకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారని, చూసుకుంటున్నారని నిర్మాత దానయ్య చెప్పడంపై..
నా ప్రతి సినిమాకి ఇలానే చేస్తానండి. నా డైరెక్టర్‌కి ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌లా పని చేస్తాను. నా నిర్మాతలందరూ హ్యాపీగా వుండాలని కోరుకుంటాను. సినిమా రిలీజైన తర్వాత అందరూ హ్యాపీగా వున్నారని తెలిస్తేనే సక్సెస్ అని ఫీలౌతాను.
ఈ సినిమాకి శనివారం అని పెట్టడానికి కారణం?
అదిరిపోయే ఎమోషనల్ రీజన్ వుంది. నా ఫేవరేట్ మూమెంట్ అది. సినిమా స్టార్ట్ అయ్యే ఐదు నిమిషాలకి వస్తుంది.
సోకులపాలెం ఇందులో కీ ఎలిలెంట్‌గా ఉంటుందని విన్నాం?
ఈ కథలో సోకులపాలెం ఒక ఎంటిటి. బ్యాక్ గ్రౌండ్ అండర్ లైన్ ఎమోషన్. సూర్య, దయ, చారుతల పాత్రల మధ్య జరిగే కథ, ఆ కథకు ఎమోషన్‌ని యాడ్ చేసేది సోకులపాలెం.
ఈ సినిమాని ప్రాంచైజ్‌గా తీసుకువెళ్ళాలనే ఆలోచన ఉందా?
పాజిబులిటీ అయితే వుంది. ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ చేస్తే పాజిబులిటీ కచ్చితంగా ఉంటుంది
ఇందులో యాక్షన్ పార్ట్ ఛాలెంజింగ్‌గా అనిపించిందా?
ఇందులో 20 పెర్సెంట్ యాక్షన్, 80 పెర్సెంట్ యాక్షన్ మూడ్ వుంటుంది. ఇందులో యాక్షన్ మూడ్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
సినిమా స్క్రీన్‌ప్లే ఎలా వుంటుంది?
స్క్రీన్‌ప్లే, నెరేటివ్ చాలా ఎక్సయిటింగ్‌గా, రేసీగా ఉంటాయి.
‘దసరా’ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా.. అప్పటికీ, ఇప్పటికీ రెస్పాన్స్ ఎలా వుంది?
నిజంగా అంత ప్రేమని నేను ఊహించలేదు. వేరే రాష్ట్రాలలో ఈవెంట్‌కి వస్తున్న జనాలని చూస్తుంటే ఇలా ఎలా వస్తున్నారని సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. సినిమా సినిమాకి చాలా ఆదరణ పెరుగుతోంది. ఇది బాధ్యతని మరింతగా పెంచుతోంది.
మీ జర్నీలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్.. అంటే?
పర్సనల్ లైఫ్‌లో అయితే జున్ను బర్త్‌డే. సినిమాల విషయానికి వస్తే మారుతూ ఉంటుంది. ‘దసరా’ సినిమాని సుదర్శన్‌లో చూసినప్పుడు చాలా మెమరబుల్‌గా అనిపించింది. ఈ సినిమాతో మరో ఫ్రెష్ మెమరీ రాబోతోంది.
Read Latest Cinema News