మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nepolean: నడిగర్‌ సంఘానికి నెపోలియన్‌ రూ.కోటి విరాళం

ABN, Publish Date - May 01 , 2024 | 09:45 AM

నడిగర్‌ సంఘం భవన నిర్మాణం కోసం సీనియర్‌ నటుడు, మాజీ ఎంపీ నెపోలియన్‌ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని నడిగర్‌ సంఘం అధికారికంగా వెల్లడించింది. టి.నగర్‌, హబీబుల్లా రోడ్డులోని నడిగర్‌ సంఘం భవన నిర్మాణ పనులు ఇటీవల పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణం కోసం పలువురు అగ్రహీరోలు, సినీ ప్రముఖులు తమవంతు విరాళాలు ఇస్తున్నారు.

Nepolean

నడిగర్‌ సంఘం (Nadigar Sangam) భవన నిర్మాణం కోసం సీనియర్‌ నటుడు, మాజీ ఎంపీ నెపోలియన్‌ (Nepolean) కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని నడిగర్‌ సంఘం అధికారికంగా వెల్లడించింది. టి.నగర్‌, హబీబుల్లా రోడ్డులోని నడిగర్‌ సంఘం భవన నిర్మాణ పనులు ఇటీవల పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణం కోసం పలువురు అగ్రహీరోలు, సినీ ప్రముఖులు తమవంతు విరాళాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా నెపోలియన్‌ కూడా కోటి రూపాయల విరాళాన్ని అందజేసినట్టు నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌ (Nassar) ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

*OTTల్లో ఈ యాక్ష‌న్‌ సినిమాలు డోంట్ మిస్‌.. ఎండింగ్ వ‌ర‌కు దంచుడే దంచుడు


అదే సమయంలో ఈ భవన నిర్మాణం కోసం ప్రజల నుంచి ఏ రూపంలోనూ విరాళాలు సేకరించడం లేదని, అందువల్ల విరాళాల సేకరణకు సంబంధించి సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని ఆయన విఙ్ఞప్తి చేశారు. కాగా, ఈ భవన నిర్మాణం కోసం అగ్రనటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), ఉదయనిధి (Udhayanidhi), విజయ్‌ (Vijay) వంటి వారు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించగా, హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) రూ.50 లక్షల విరాళాన్ని అందజేశారు. కాగా, కొన్నేళ్ళుగా అసంపూర్తిగా మిగిలివున్న ఈ భవన నిర్మాణ పనులను ఈ యేడాది ఆఖరు నాటికి పూర్తి చేయాలని నడిగర్‌ సంఘ కార్యవర్గం సంకల్పంతో ఉంది.


అంతేకాదు, ఈ భవన నిర్మాణాన్ని నడిగర్‌ సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా విశాల్ (Vishal) ఇటీవల ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ‘‘నడిగర్‌ సంఘం భవన (Nadigar Sangam Building) నిర్మాణం ఈ యేడాది ఆఖరు నాటికి పూర్తి కావచ్చు. ఆయా భాషల చిత్రపరిశ్రమలకు హైదరాబాద్‌, ముంబై నగరాల్లో మంచి ఆడిటోరియాలున్నాయి. ఆ తరహా సౌకర్యాలు మనకు లేవు. అందుకే నడిగర్‌ సంఘం భవాన్ని నగరంలోనే ఒక ఐకానిక్‌గా నిర్మించాలన్న తపన మా కార్యవర్గ సభ్యులందరిలో ఉంది. అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నాం. ఈ భవనంలో పెద్ద ఆడిటోరియం, సినిమా ఈవెంట్స్‌ జరుపుకునేందుకు వీలుగా థియేటర్‌, నడిగర్‌ సంఘం సభ్యులు తమ పిల్లలకు ఉచితంగా వివాహం చేసుకునేందుకు వీలుగా ఒక కల్యాణ మండపం, థియేటర్‌ ఆర్టిస్టులు, స్టేజ్‌ కళాకారులు నాటకాలు ప్రదర్శించుకునేందుకు అనువుగా మరో థియేటర్‌, మాట్లాడుకునేందుకు ఒక సెంటర్‌, దాదాపు వంద నుంచి 130 కార్లు పార్కింగ్‌ చేసుకునేలా విశాలమైన పార్కింగ్‌ స్థలం ఇలా అనేక అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నాం’’ అని విశాల్ చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - May 01 , 2024 | 09:45 AM