మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mammootty and Nayanathara: మమ్ముట్టి, నయనతార కాంబోలో సినిమా.. ఆ దర్శకుడి కల నెరవేరబోతోందా?

ABN, Publish Date - May 15 , 2024 | 11:18 AM

మెగాస్టార్ మమ్ముట్టి , నయనతార కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సినిమాతో ఓ దర్శకుడి కల నెరవేరబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏమా కల? అని అనుకుంటున్నారా? విషయంలోకి వస్తే.. సంచలన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ మధ్య తన డ్రీమ్ ఇదంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

Mammooty and Nayanathara

మెగాస్టార్ మమ్ముట్టి (Megastar Mammootty), నయనతార (Nayanthara) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సినిమాతో ఓ దర్శకుడి కల నెరవేరబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏమా కల? అని అనుకుంటున్నారా? విషయంలోకి వస్తే.. సంచలన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఈ మధ్య తన డ్రీమ్ ఇదంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

*Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్‌లో కొత్తదనం ఏమీ కనిపించలేదు!


అదేమంటే.. ఇప్పటి వరకు తమిళ్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్.. తన మాతృభాష అయిన మలయాళంలో ఇంత వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎప్పటికైనా తన మాతృభాష అయిన మలయాళంలో సినిమా చేస్తానని, అదే తన డ్రీమ్ అని ఆ మధ్య గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మమ్ముట్టి, నయనతారల కాంబినేషన్‌లో సినిమా ఉండబోతుందనేలా మలయాళ సినీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. (Nayanathara to Share Screen with Mammotty in Goutham Menon movie)


ఈ సినిమా తమిళ్, మలయాళంలో ఉంటుందో.. లేదంటే కేవలం మలయాళంలోనే ఉంటుందో తెలియదు కానీ.. మమ్ముట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని మాత్రం తెలుస్తోంది. కేరళకు చెందిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Director Gautham Vasudev Menon) ప్రస్తుతం కోలీవుడ్‌లో స్థిరపడిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో ఆయన స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నప్పటికీ.. మలయాళంలో మాత్రం ఇంత వరకు ఆయన సినిమా చేయలేదు. అందుకే ఈ సినిమా విషయంలో ఆయన ఎగ్జైటెడ్‌గా ఉన్నారని తెలుస్తోంది. అలాగే మమ్ముట్టిని డైరెక్ట్ చేసే విషయంలో కూడా ఆయన ఆసక్తిగా ఉన్నారనేలా టాక్ నడుస్తోంది. చూద్దాం మరి.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో...

Read Latest Cinema News

Updated Date - May 15 , 2024 | 11:22 AM