Nayanthara: ఆ యువకుడు చేసిన పనికి నయన్ ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-04-08T13:24:22+05:30 IST

ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి నయనతార (Nayathara). రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఆమె ఓ యువకుడి ప్రవర్తనతో విసిగిపోయింది. ఫోన్‌ను పగల కొట్టేస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Nayanthara: ఆ యువకుడు చేసిన పనికి నయన్ ఏం చేసిందంటే..

ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి నయనతార (Nayathara). రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఆమె ఓ యువకుడి ప్రవర్తనతో విసిగిపోయింది. ఫోన్‌ను పగల కొట్టేస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్స్ అందరు విపరీతంగా షేర్ చేస్తుస్తున్నారు.

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నయన్, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) దేవాలయానికి వెళ్లారు. తమ కులదైవం ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నయన్ దంపతులు వచ్చారని తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎగ బడ్డారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ అక్కడ ఉన్న పోలీసులు సైతం వారిని ఆపలేకపోయారు. దీంతో విఘ్నేశ్ శివన్ తమని ప్రశాంతంగా పూజ చేసుకోనివ్వాలని కోరాడు. అయినప్పటికీ అక్కడికి వచ్చిన అభిమానులు మాత్రం ఆయన మాటను పెడ చెవిన పెట్టారు. స్థానికులు ప్రవర్తనతో నయన్ తీవ్రంగా విసిగిపోయింది. పూజా అనంతరం అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేసింది. కొంత మంది అభిమానుల కోరికను మన్నించి వారికి సెల్ఫీలు ఇచ్చింది. అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె రైలులో ప్రయాణించింది. నయన్ రైల్లోకి ఎక్కిన వెంటనే ఓ యువకుడు ఆమెతో వీడియో తీసుకునేందుకు అత్యుత్సాహం చూపించాడు. అప్పటికే కోపంతో ఉన్న నయన్ ఆ యువకుడి పవర్తనతో మరింత విసిగిపోయింది. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్‌ను పగల కొట్టేస్తా అంటూ కేకలు వేసింది.

Vignesh-Shivan.jpg

నయనతార ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. 75వ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించనుంది. ఈ సినిమాలో ఆమెకు జోడీగా జై నటించనున్నాడు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-08T19:25:15+05:30 IST