Nayanthara: అక్క పాత్రకు అంత రెమ్యునరేషనా?
ABN , Publish Date - May 15 , 2024 | 10:03 AM
ఇటీవల కాలంలో అగ్రహీరోయిన్ నయనతార హీరోల సరసన కథానాయికగా నటించే చిత్రాల కంటే హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించేందుకు అధిక ఆసక్తి చూపుతోంది. అదేసమయంలో అగ్రహీరోలతో మాత్రం ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు అక్కపాత్రలు కూడా ఉన్నాయి. ఈ పాత్రల్లో నటించేందుకు ఆమె అంగీకరిస్తున్నప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

*OTT: అదిరిపోయే హాలీవుడ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఓటీటీలోకి ఎప్పుడంటే!
నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మన్నాంగట్టి సిన్స్ 1960’ (Mannangatti: Since 1960) అనే చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత నవీన్ పాలి (Nivin Pauly)తో కలిసి ‘డియర్ స్టూడెంట్స్’ (Dear Students) అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, ఓ కన్నడ మూవీలో కూడా ఆమె నటిస్తున్నారు. ఇందులో అక్క పాత్రను ఆమె పోషిస్తున్నారు. అయినప్పటికీ తన రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు ససేమిరా అన్నారట. పైగా తాను తీసుకునే పారితోషికం కంటే అధికంగానే రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారట.
నయనతారకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ ఓకే చెప్పారనేలా టాక్ వినబడుతోంది. దీంతో కోలీవుడ్ మొత్తం.. అక్క పాత్రకి అంత రెమ్యూనరేషనా? అనేలా మాట్లాడుకుంటుండటం విశేషం. కాగా.. ‘మన్నాంగట్టి సిన్స్ 1960’ చిత్రంలో యోగిబాబు, దేవదర్శిని సుకుమారన్ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తుండగా.. ‘డియర్ స్టూడెంట్స్’లో నవీన్ పాలి మాస్ పాత్రలో కనిపించనున్నారు.