Satyabhama: ఓటీటీలో దుమ్మురేపుతోన్న కాజల్ అగర్వాల్ సినిమా..

ABN , Publish Date - Jul 04 , 2024 | 05:56 PM

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్యభామ’ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ సినిమా హ్యూజ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా గత నెల 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇండియా వైడ్ నెంబర్ 1 ప్లేస్‌లో ‘సత్యభామ’ ట్రెండింగ్ అవుతోందని సదరు ఓటీటీ ప్రకటించింది.

Kajal Aggarwal in Satyabhama

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్యభామ’ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ సినిమా హ్యూజ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా గత నెల 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇండియా వైడ్ నెంబర్ 1 ప్లేస్‌లో ‘సత్యభామ’ ట్రెండింగ్ అవుతోందని.. ఈ సినిమా అతితక్కువ సమయంలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకుందని సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది.

Also Read- Manamey OTT Release Date: ఓటిటి లోకి ఇంకో ఫ్లాప్ మూవీ వచ్చేస్తోంది, ఎప్పుడు ఎక్కడ అంటే...


ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. జూన్ 7వ తేదీన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చింది సత్యభామ. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ ఇందులో ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.


Kajal-Aggarwal.jpg

‘సత్యభామ’ కథ విషయానికి వస్తే.. ఓ హత్యకేసులో ఎమోషనల్ అయిన సత్యభామ ఆ కేసును ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఎలా సాల్వ్ చేసింది, బాధితురాలికి ఎలా న్యాయం చేసింది అనేది ఈ సినిమాలో హార్ట్ టచింగ్‌గా, ఇంటెలిజెంట్‌గా చూపించారు. సత్యభామలో కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అనేలా టాక్ రావడం విశేషం. సత్యభామ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణతో పాటు ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Read Latest Cinema News

Updated Date - Jul 04 , 2024 | 05:56 PM