Satyabhama: 'సత్యభామ' నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, నా కెరీర్ లో కొత్త ప్రయత్నం: కాజల్

ABN , Publish Date - May 30 , 2024 | 04:42 PM

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన 'సత్యభామ' జూన్ 7 న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో కాజల్ ఈ సినిమా గురించి మాట్లాడారు. ఇది తనకి సెకండ్ ఇన్నింగ్స్ కాదని, తాను ఈ సినిమాతో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ఇందులో పోరాట సన్నివేశాలు చాలా ఉన్నాయని, అందుకోసం చాలా కష్టపడ్డాను అని చెప్పారు

Satyabhama: 'సత్యభామ' నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, నా కెరీర్ లో కొత్త ప్రయత్నం: కాజల్
Kajal with Satyabhama team

అగ్రనటీమణుల్లో ఒకరైన కాజల్ తన కెరీర్ ని ఇంకో మలుపు తిప్పుకునేట్టు 'సత్యభామ' సినిమా చేస్తోంది. ఇంతవరకు సినిమాల్లో కథానాయిక పాత్రలు మాత్రమే వేస్తూ వచ్చిన కాజల్, ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తూ చేసిన సినిమా 'సత్యభామ'. ఇందులో ఆమె ఒక పోలీసు ఆఫీసరు పాత్ర వేస్తోంది, అలాగే ఇది ఒక యాక్షన్ సినిమా కూడా. ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకుడు, కాగా 'మేజర్' లాంటి సినిమాతో తన దర్శకత్వ ప్రతిభ కనబరిచిన శశికిరణ్ తిక్క ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు, అలాగే సమర్పకులుగా కూడా వ్యవహరిస్తున్నారు.

kajal.jpg

ఈ సినిమా తన కెరీర్ లో ఒక కొత్త ప్రయత్నం అని చెప్పింది కాజల్ అగర్వాల్. "సత్యభామ సినిమాతో నా కెరీర్ లో కొత్త ప్రయత్నం చేశా. ఇలాంటి క్యారెక్టర్, మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ వినగానే నచ్చింది కొత్తగా అనిపించింది అందుకే సినిమా చేసేందుకు ముందుకొచ్చా. నేను ఇలాంటి కథల్లో, క్యారెక్టర్స్ లో నటించాలి అనేది మైండ్ లో పెట్టుకోలేదు. మంచి కంటెంట్ ఉంటే ఏ జానర్ అయినా చేస్తాను," అని చెప్పింది కాజల్.

'సత్యభామ' కంటే ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యడం కోసం తనకి చాలా ఆఫర్స్ వచ్చాయని, అయితే ఆ సినిమాలు తను కాన్ఫిడెంట్ గా వున్నప్పుడే చెయ్యాలని అనుకున్నానని చెప్పింది. అలాగే ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు తనపై ఎటువంటి ఒత్తిడి ఉండదని, ఒత్తిడి కంటే ఎక్కువ భాద్యతగా ఫీల్ అయి చేస్తాను అని చెపుతోంది. 'సత్యభామ'లో కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. మొదటిసారిగా నా కెరీర్ లో యాక్షన్, అలాగే భారీ స్టంట్స్ కూడా చేశాను. వాటి కోసం చాలా కష్టపడ్డాను అని చెప్పింది.

kajalagarwalsatyabhama.jpg

అలాగే చాలామంది అనుకుంటున్నట్టుగా, 'సత్యభామ' నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, నా కెరీర్ మరో కొత్త దిశలో వెళ్తుందని అనుకోవచ్చు అని చెప్పింది. "యాక్టింగ్ నా ప్యాషన్ అందుకే నా పర్సనల్ లైఫ్ లోకి వెళ్లిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కలిసినప్పుడు ఆయన నేడు క్రిమినల్స్ గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ ఎలా చేస్తున్నారో వివరించారు. ఆయన చెప్పిన అంశాలు మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి", అని చెప్పింది.

Kajal.jpg

అందుకే వాటిని కథలో కూడా ఒక భాగంగా చేశామని చెప్పింది. "నేను ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పుడు 'సత్యభామ'తో ఆ కోరిక తీరిందని అనుకుంటున్నా", అని చెప్పింది కాజల్ అగర్వాల్. ఈ సినిమా జూన్ 7న విడుదలవుతోంది.

Updated Date - May 30 , 2024 | 04:42 PM