Satyabhama OTT: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన.. కాజల్ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్! డోంట్ మిస్
ABN , Publish Date - Jun 28 , 2024 | 10:29 AM
ప్రేక్షకులను థ్రిల్ రైడ్ చేయించేందుకు రీసెంట్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. కాజల్ ఆగర్వాల్ మెయిన్ లీడ్‌గా నటించిన సత్యభామ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
తెలుగు సినీ ప్రేక్షకులను అలరించేందుకు, థ్రిల్ రైడ్ చేయించేందుకు రీసెంట్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. కాజల్ ఆగర్వాల్ (Kajal Aggarwal) చాలాకాలం తర్వాత పూర్తి స్థాయిలో మెయిన్‌లీడ్‌గా ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్‌గా చేసిన చిత్రం సత్యభామ (Satyabhama). ఈనెలలోనే (జూన్ 7)న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్‌తో మంచి విజయం సాధించింది. కాజల్‌కు జంటగా నవీన్ చంద్ర (Naveen Chandra) నటించగా ప్రకాశ్ రాజ్ (Prakash Raj), హర్షవర్ధన్ (Harsha Vardhan), నేహా పఠాన్, పాయల్ రాధా కృష్ణ (Payal Radhakrishna) ప్రధాన పాత్రల్లో నటించారు. మేజర్ ,గూడాచారి చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క (Sashi Kiran Tikka) ఈ సినిమాను నిర్మించగా సుమన్ చిక్కాల (Suman Chikkala) దర్శకత్వం వహించారు.
కథ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో షీ టీమ్‌ను లీడ్ చేస్తుంటుంది ఏసీపీ సత్యభామ (కాజల్ అగర్వాల్). ఓ రోజు తన దగ్గరికి హసినా అనే యువతి వచ్చి నా భర్త యదు నన్ను బాగా హింసిస్తున్నాడని, కొడుతున్నాడని కంప్లైంట్ ఇస్తుంది. దీంతో సత్యభామ హసినా భర్తను కొట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఎనీ టైం నాకు కాల్ చేయమని ఎనీటైం సాయం చేస్తానని హసినాకు మాట ఇచ్చి వెళ్లిపోతుంది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో యదు హసీనాపై మరోసారి దాడి చేయగా సత్యభామ వచ్చే స మయానికి తను చనిపోతుంది. ఎలా అయినా యదుని పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న సత్యభామకు తర్వాత చాలా విభిన్న పరిస్థితులు ఎదురవుతాయి. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఎన్నో కొత్త కొత్త కథలు బయటకు వస్తుంటాయి.
ఈ నేపథ్యంలో సత్యభామ ఈ కేసును ఎలా చేధించింది, చివరకు యదును పట్టుకోగలిగిందా, ఎంపీకి, ఆయన కుమారుడు రిషికి ఈ కేసుతో లింకేంటి, హసీనా తమ్ముడు ఇక్బాల్ (ప్రజ్వల్) ఎందుకు యాంటీగా మారాడు? అనే చాలా ట్విస్టులు, ఫ్లాష్ బ్యాక్స్ మద్య సినిమా అసాంతం ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ప్రముఖ ఓటీటీ అమోజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో మిస్సయిన వారు, మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను చూడాలనుకునే వారు ఈ వీకెండ్ ఈ సత్యభామ (Satyabhama) సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకుండా కుటుంబంతో కలిసి చూసేయండి.