Kalki 2898AD OTT: ‘కల్కి 2898AD’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

ABN, Publish Date - Aug 17 , 2024 | 11:48 AM

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రని లిఖించిన రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ చిత్రం ఓటీటీలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. అవును కొన్ని రోజులుగా ‘కల్కి 2898AD’ ఓటీటీ విడుదలకు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ వార్తలు పుట్టించేస్తూ వచ్చారు. ఆగస్ట్ 22 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సదరు ఓటీటీ సంస్థలు అధికారికంగా ప్రకటించారు.

Kalki 2898AD Movie Still

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రని లిఖించిన రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ‘కల్కి 2898AD’ (Kalki 2898AD) చిత్రం ఓటీటీలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. అవును కొన్ని రోజులుగా ‘కల్కి 2898AD’ ఓటీటీ విడుదలకు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ వార్తలు పుట్టించేస్తూ వచ్చారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగస్ట్ 22 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ (NetFlix)లో విడుదలకానుంది. దీంతో ‘కల్కి 2898AD’ ఓటీటీ నిరీక్షణ కోసం వేచి చూసే వారికి అమెజాన్ శుభవార్త చెప్పినట్లయింది.

Also Read- National Awards: తెలుగు సినిమాకు అన్యాయం జరిగిందా?


కేవలం 14 రోజుల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్

జూన్ 27న థియేటర్లలలోకి వచ్చిన ఈ సినిమా కేవలం కేవలం 14 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 1002 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో వెయ్యి కోట్లు ఆర్జించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా ‘కల్కి 2898AD’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా కనీవినీ ఎరుగని రికార్డ్‌ని క్రియేట్ చేసింది. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి రెండో పార్ట్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ రెండో పార్ట్ షూటింగ్‌కు సంబంధించి అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇక ‘కల్కి 2898AD’ సాధించిన హిస్టారికల్ సక్సెస్‌తో ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’, ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’, హను రాఘవపూడితో ఓ క్రేజీ మూవీ చేస్తున్నారు. (Kalki 2898AD OTT Release Date)


‘కల్కి 2898AD’ కథ విషయానికి వస్తే..

ఈ సినిమా కథ మహాభారత యుద్ధం ముగింపు దశతో ప్రారంభం అవుతుంది. అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంలో వున్న శిశువుని చంపడానికి అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) ప్రయత్నం చేస్తాడు, కానీ సఫలం కాలేడు. అశ్వద్ధామ చేసిన పనికి శ్రీకృష్ణుడు అశ్వద్ధామకి శాపం ఇస్తాడు, పశ్చాత్తాపం పొందిన అశ్వద్ధామకి కలియుగంలో మళ్ళీ కల్కిగా అవతరించబోతున్నాను, ఆ శిశువుని నువ్వే కాపాడాలి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఇక కలియుగంలో సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) కాంప్లెక్స్‌కి అధిపతి. తన కాంప్లెక్స్‌లో అతను ఒక ఫెర్టిలిటీ ల్యాబ్‌ను నడుపుతూ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని చూస్తూ ఉంటాడు. అందరి ఆడవాళ్ళని టెస్టు చేస్తూ ఉంటాడు, అలా చేస్తున్నప్పుడు సుమతి (దీపికా పదుకోన్) అనే ఆమె తనకి కావలసిన అమ్మాయి అని అనుకుంటాడు. భైరవ (ప్రభాస్) కాంప్లెక్స్ లోకి ప్రవేశించి అక్కడ మంచి జీవితం గడపాలి అని కలలు కంటూ, కాంప్లెక్స్ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క యాస్కిన్ బారినుండి సుమతిని కాపాడటానికి అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) బయలుదేరతాడు. శంబాలాలో మరియం (శోభన) ఆమె మనుషులు సుమతి రాక కోసం ఎదురుచూస్తూ వుంటారు. సుమతి గర్భంలో పెరుగుతున్న పిల్లవాడు సామాన్యుడు కాదు స్వయానా భగవంతుడు అని అంటారు. సుమతిని తీసుకువచ్చి అప్పజెబితే కాంప్లెక్స్‌లోకి పెర్మనెంట్‌గా వుండి మంచి జీవితం గడపవచ్చు అని చెబితే భైరవ సుమతిని తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. భైరవ, అశ్వద్ధామని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. భైరవ ప్రయత్నం ఫలించిందా? అశ్వద్ధామ మహాభారత యుద్ధం అయిన తరువాత కృష్ణుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి సుమతి గర్భంలో పెరుగుతున్న బిడ్డని కాపాడగలిగాడా? శంబాలాలో ప్రజలు ఎందుకు సుమతి కోసం ఎదురు చూస్తున్నారు? యాస్కిన్ తను కలలు కన్న కొత్త ప్రపంచాన్ని సృష్టించగలిగాడా? చివరికి ఏమైంది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Read Latest Cinema News

Updated Date - Aug 17 , 2024 | 11:48 AM