Kalki 2898AD: మూడేళ్లు టార్చర్‌ పెట్టాడు.. నాగ్ అశ్విన్‌పై ప్ర‌భాస్ సెటైర్లు

ABN , Publish Date - May 23 , 2024 | 06:27 AM

‘‘కల్కి 2898 ఏడి’ చిత్రం ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మా బక్క డైరెక్టర్‌ (నాగ్‌ అశ్విన్‌) బుజ్జితో నన్ను మూడేళ్లు టార్చర్‌ పెట్టాడు. బుజ్జి (కారు) బ్రెయిన్‌ చిన్నదైనా నా బుర్రంతా తినేసింది అని అన్నారు.

Kalki 2898AD: మూడేళ్లు టార్చర్‌ పెట్టాడు.. నాగ్ అశ్విన్‌పై ప్ర‌భాస్ సెటైర్లు
kalki Prabhas,

‘‘కల్కి 2898 ఏడి’ చిత్రం ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మా బక్క డైరెక్టర్‌ (నాగ్‌ అశ్విన్‌) బుజ్జితో నన్ను మూడేళ్లు టార్చర్‌ పెట్టాడు. బుజ్జి (కారు) బ్రెయిన్‌ చిన్నదైనా నా బుర్రంతా తినేసింది. ఈ సినిమాలో బుజ్జి (Bujji), భైరవ, నాగ్‌ అశ్విన్‌ ప్రతిభ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది’ అని ప్రభాస్‌ (Prabhas) అన్నారు. ఆయన కథానాయకుడిగా, అమితాబ్‌బచ్చన్‌, కమల్‌హాసన్‌ లాంటి అగ్రతారలతో రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898AD). దీపికా పదుకొనే కథానాయిక. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ బేనర్‌పై సి. అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జూన్‌ 27న ఈ చిత్రం విడుదలవుతోంది.

Prabhas,

భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను కూడా వినూత్నంగా భారీతనం ఉట్టిపడేలా నాగ్‌ అశ్విన్‌ నేతృత్వంలో చిత్రబృందం నిర్వహిస్తోంది. బుధవారం ‘కల్కి’ (Kalki 2898AD) చిత్ర బృందం హైదరాబాద్‌లో ‘క్యూట్‌ స్టార్‌ బుజ్జి’ (Bujji) అనే కారును పరిచయం చేస్తూ బుజ్జి వర్సెస్‌ భైరవ పేరుతో భారీ ఈవెంట్‌ను నిర్వహించింది. చిత్రబృందంతో పాటు ప్రభాస్‌ (Prabhas) అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుజ్జి కారును నడుపుతూ ప్రభాస్‌ సందడి చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు.

GOOtoUpWoAAtOAU.jpeg

ఈ సందర్భంగా ప్రభాస్‌ (Prabhas) మాట్లాడుతూ ‘నేను చాలా లక్కీ. అమితాబ్‌బచ్చన్‌, కమల్‌హాసన్‌ లాంటి దిగ్గజాలతో నటించే అవకాశాన్ని ‘కల్కి’ నాకు ఇచ్చింది. కమల్‌సార్‌కి వంద దండాలు. ఇండియా గర్వించే నటుడు అమితాబ్‌. ఆయన స్ఫూర్తితోనే చాలామంది సినిమాల్లోకి వచ్చారు. ‘సాగరసంగమం’ చిత్రంలో కమల్‌హాసన్‌ను చూసి ఆయన వేసుకున్న దుస్తులు లాంటివి, కుట్టించుకొని వేసుకున్నాను. ఆ సినిమాలోని ఓ పాటలో ఆయన తలను లయబద్దంగా ఊపే నాట్య భంగిమ చూసి నేను కూడా అలా చేయాలని ప్రయత్నించానని అన్నారు.


దీపిక లాంటి ఇంటర్నేషనల్‌ స్టార్‌ ఈ సినిమాలో ఉండడం సంతోషం. దిశా అద్భుతమైన నటి. అశ్వనీదత్‌ గారు ఈ వయసులోనూ చాలా కష్టపడుతున్నారు. ఆయన ప్యాషన్‌ చూసి చాలా నేర్చుకోవాలి. సినిమా గ్రాండ్‌గా రావడానికి ఖర్చుకు వెనుకాడ లేదు. నిర్మాతగా 50 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నది బహుశా ఆయనొక్కరే. మొదటి చిత్రాన్నే ఎన్టీఆర్‌తో చేశారంటేనే ఆయన రేంజ్‌ తెలుస్తుంది. వారి కూతుళ్లు స్వప్న, ప్రియాంక గారికి సైతం అదే ప్యాషన్‌, తెగింపు వచ్చాయి. వారిని చూసి ఎలా పనిచేయాలో నేర్చుకోవాలని మా చెల్లెళ్లకు చెబుతుంటాను’ అన్నారు.

prabhas.jpeg

నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) మాట్లాడుతూ ‘బుజ్జి.. పేరు చిన్నగా అనిపిస్తుంది గానీ, అది చేసే పని మాత్రం మామూలుగా ఉండదు. ఈ సినిమాలో బుజ్జి చాలా స్పెషల్‌. ఇలాంటి కార్‌ను ఇంజినీరింగ్‌ చేయడం చాలా కష్టం. ఒక కొత్త తరహా కారు తయారు చేయాలంటే పెద్ద టీమ్‌ ఉండాలి. ఆనంద్‌ మహీంద్రా గారు ఆ టీమ్‌ను పంపడం వల్లే బుజ్జి అనే కల సాకారమైంది. దీని తయారీలో మా టీమ్‌ కూడా చాలా కష్ట పడింది’ అన్నారు. అశ్వనీదత్‌ మాట్లాడుతూ ‘‘కల్కి’ (Kalki 2898AD)సినిమా గురించి ఒక్కటే మాట చెబుతాను. ఇది రిలీజయ్యేంత వరకూ చిన్న సినిమా. రిలీజయ్యాక చాలా పెద్ద సినిమా’ అని అంచనాలు మరింత పెంచారు.

Updated Date - May 23 , 2024 | 10:15 AM