Raj Tarun - Lavanya Case: రాజ్ తరుణ్‌కు భారీ ఊరట

ABN, Publish Date - Aug 08 , 2024 | 08:29 PM

హీరో రాజ్ తరుణ్‌పై లావణ్య పెట్టిన నార్సింగి కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన ముందస్తు​ బెయిల్‌ను మంజూరు చూసింది. దీంతో రాజ్ తరుణ్‌కు భారీ ఊరట లభించింది. లావణ్యతో పెళ్లి జరిగినట్లుగా ఆధారాలు లేనందున తెలంగాణ హైకోర్టు రాజ్ తరుణ్‌కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

Hero Raj Tarun

నాపై లావణ్య (Lavanya) చేసినవని ఆరోపణలు మాత్రమే, ఇంతవరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని రీసెంట్‌గా జరిగిన ‘తిరగబడరసామీ’ మూవీ ప్రమోషన్స్‌లో రాజ్ తరుణ్ (Hero Raj Tarun) చెప్పిన విషయం తెలిసిందే. మగవాళ్లపై తప్పుడు కేసులు పెట్టే మహిళలున్నారు.. నాపై కూడా తప్పుడు కేసులు పెట్టారు అని రాజ్ తరుణ్ చెప్పినట్లుగానే.. ఆయనపై లావణ్య పెట్టిన నార్సింగి కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన ముందస్తు​ బెయిల్‌ (Bail To Hero Raj Tarun)ను మంజూరు చూసింది. దీంతో రాజ్ తరుణ్‌కు భారీ ఊరట లభించింది. లావణ్యతో పెళ్లి జరిగినట్లుగా ఆధారాలు లేనందున తెలంగాణ హైకోర్టు రాజ్ తరుణ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Also Read- Thriller Movies: ఆహా ఓటీటీలోకి వచ్చిన మరో రెండు ఎక్సయిటింగ్ థ్రిల్లర్స్

రాజ్ తరుణ్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. రాజ్ తరుణ్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 30కి పైగా సినిమాలలో రాజ్ తరుణ్ నటించారు. ఆయనపై ఎటువంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారు. కేసు అయితే పెట్టారు కానీ.. కోర్టు అడిగిన ఆధారాలు వారు చూపించలేదు. లావణ్యతో పెళ్లి జరిగినట్లుగా ఆధారాలు లేనందున రాజ్ తరుణ్‌కు రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని చెబుతూ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. (Raj Tarun and Lavanya Case)


అసలు విషయం ఏమిటంటే.. ‘‘పదకొండేళ్లగా రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) నాతో ఉంటున్నాడు. ఏడేళ్లు ఇద్దరం కలిసి సంసారం చేశాం. అతనంటే నాకు ప్రాణం. అతనిప్పుడు నన్ను వదిలేసి మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra)‌తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు.. నా రాజ్‌ నాకు కావాలి’’ అంటూ లావణ్య ఇటీవల మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌ తనను ప్రేమించాడనీ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఇటీవల ఆమె నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ (Narsingi Police Station) లో ఫిర్యాదు చేశారు. దీనిపై రాజ్‌ తరుణ్‌ కూడా స్పందించాడు. రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనని, కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరంగా ఉన్నాననీ, కొంతకాలంగా టార్చర్‌ చేస్తుందని మీడియాకు తెలిపారు రాజ్‌ తరుణ్‌. ఇలా మొదలైన ఈ ఇష్యూ ట్విస్ట్‌లతో ఓ టీవీ సీరియల్‌ (TV Serial)లా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ముందు ముందు ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో అనేలా.. ఈ ఇష్యూపై ఇండస్ట్రీలో మాట్లాడుకుంటుండటం గమనార్హం.

Read Latest Cinema News

Updated Date - Aug 08 , 2024 | 08:29 PM