Raj Tarun - Lavanya Case: లావణ్య తల్లిదండ్రులు ఆవేదన.. ఇద్దరినీ కలపాలనే!
ABN , Publish Date - Jul 12 , 2024 | 04:24 PM
ప్రస్తుతం టాలీవుడ్‌లో రాజ్‌తరుణ్ - లావణ్యల వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు లావణ్య మాత్రమే బయటకు వచ్చింది. రాజ్‌తరుణ్ ఓసారి మీడియా ముందుకొచ్చారు. ఇప్పుడు లావణ్య తల్లిదండ్రులు కూడా మీడియాను ఆశ్రయించారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో రాజ్‌తరుణ్ (Raj Tarun)- లావణ్యల (Lavanya) వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు లావణ్య మాత్రమే బయటకు వచ్చింది. రాజ్‌తరుణ్ ఓసారి మీడియా ముందుకొచ్చారు. ఇప్పుడు లావణ్య తల్లిదండ్రులు కూడా మీడియాను ఆశ్రయించారు(Lavanya Parents). తాజాగా మీడియా ముందుకొచ్చి చెప్పుకోలేని సంఘటనలు జరిగాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్‌తరుణ్‌కు లావణ్య ఎన్నో డబ్బులు ఇచ్చి ఆదుకుందని ఆమె తండ్రి చెప్పారు. అతను గత పదేళ్లుగా తెలుసని, తమ కూతురు చెప్పిందని అతడిని నమ్మినట్లు చెప్పారు. "మా అమ్మాయికి అన్యాయం జరిగింది. ఇప్పుడు వాళ్లిద్దరినీ కలపాలని ఆలోచన తప్ప మరో ఉద్దేశం లేదు. గతంలో రాజ్‌తరుణ్ తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉండేవాళ్లం. ఇప్పుడు ఫోన్ చేసినా కలవడం లేదు. అప్పుడు వాళ్లింటికి వెళ్తుండేవాళ్లం. ఇప్పుడు ఫోన్ కూడా లేదు. గత మూడు నెలల నుంచి రాజ్‌తరుణ్ తల్లిదండ్రులకు, మాకు ఎలాంటి మాటలు లేవు. లావణ్యకు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు. అదంతా అబద్థం’’ అని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు.
చాక్లెట్ కూడా సరిగా తినలేని అమ్మాయిని.. డ్రగ్స్ తీసుకుంటుందని అబద్థం చెప్పారు. ఇలాంటి వార్తలను పుట్టించిన మూర్ఖుడు ఎదురుగా ఉంటే కొట్టాలనేంత బాధగా ఉంది. కానీ వారిద్దరు ఒక్కటైతే చాలు. అతను లావణ్యతో కలిసి జీవించాలనుకుంటే సహకరిస్తాం. లావణ్యకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని తెలిసింది. తనకు ఏమైనా జరిగితే ఊరుకొనేది లేదు. ఆమెకు న్యాయం జరగాలి’’ అని అన్నారు. రాజ్‌తరుణ్ నటుడు కాక ముందు నుంచే తనతో రిలేషన్‌లో ఉన్నానని.. ఇప్పుడు ఓ మామూలు అమ్మాయిగా తనకు న్యాయం కావాలని లావణ్య కోరుతున్నారు. రాజ్‌తరుణ్ ఇక తనకు దక్కడనే పరిస్థితి వస్తే చట్టపరంగా వెళ్తానని లావణ్య చెప్పారు.