Raj Tarun and Lavanya: లావణ్యకి ఇంకో పేరు కూడా వుంది తెలుసా? నటి మాధవీలతకి ఈమె చెల్లెలా?

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:04 PM

రాజ్ తరుణ్ ప్రియురాలు అని చెప్పిన లావణ్య కొన్ని సినిమాలలో నటించింది, అలాగే ఆమె స్క్రీన్ నేమ్ కూడా ఇంకోటి వుంది. ఈమె ప్రముఖ నటి మాధవీలత కి చెల్లెలు అని కూడా అనుకుంటున్నారు, ఇంతకీ ఇందులో నిజమెంత ఉందొ తెలుసుకోండి.

Madhavi Latha, Raj Tarun and Lavanya

నటుడు రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే లావణ్యకి, రాజ్ తరుణ్ సుమారు పది సంవత్సరాలకి పైగా పరిచయం వుంది అని కొందరు అంటున్నారు. అలాగే చాలామంది లావణ్య అంటే 'నచ్చావులే' లో కథానాయకురాలిగా చేసిన మాధవీలత కి చెల్లెలు అని కూడా అనుకుంటున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈమె మాధవీలతకి చెల్లెలు కాదు. (Lavanya's screen name is Anvika Rao and she acted in few films with that screen name)

కథానాయకురాలిగా చాలా విజయవంతమైన సినిమాలలో నటించిన మాధవీలతకి లావణ్య పరిచయం అంతే. మాధవీలత 'అతిధి', 'నచ్చావులే', 'స్నేహితుడు', 'చూడాలని చెప్పాలని' ఇలా చాలా సినిమాలలో కథానాయకురాలిగా నటించింది. మాధవీలతని లావణ్య అక్కా అని పిలిచేదని, అప్పట్లో లావణ్యకి సినిమాల్లో నటించాలని ఉండేదని తెలిసింది. అప్పటికే లావణ్య పేరుతో నటీమణులు ఉండటంతో, లావణ్యకి స్క్రీన్ పేరు కూడా అన్విక రావు అని మార్చినట్టుగా తెలిసింది. (Lavanya used to tell people that actress Madhavi Latha is her sister, but in real life they are friends, not real sisters)

rajtarunanvika.jpg

అన్విక రావు అని పేరు మార్చుకున్న తరువాత లావణ్య సినిమా కూడా ఒకటి ఓపెనింగ్ అయిందని, కానీ ఆ సినిమా విడుదలకి నోచుకోలేదని తెలిసింది. అలాగే అన్వీక రావు పేరుతో లావణ్య చిన్న చిన్న పాత్రల్లో కొన్ని సినిమాలు చేసిందని కూడా అంటున్నారు.

కోన వెంకట్ రచించిన, ఉదయ్ నందనవనం దర్శకత్వంలో 2015 లో వచ్చిన 'శంకరాభరణం' సినిమాలో అన్విక రావు ఒక చిన్న పాత్ర కూడా వేసింది అని తెలిసింది. అయితే అప్పుడు అన్విక రావు గానే ఆమె పేరుని ఆ సినిమాలో వేసినట్టుగా తెలిసింది. (Lavanya complained to police on Raj Tarun that he allegedly living with another actress)

ఆ తరువాత చాలామందికి తను మాధవీలత సిస్టర్ గానే పరిచయం అవటంతో, అందరూ ఈమె మాధవీలత చెల్లెలు అనే అనుకుంటున్నారు. కానీ మాధవీలతకి ఈమె నిజమైన చెల్లెలు కాదు. మాధవిలతకి చెల్లెల్లు లేరు, ఆమె ఇద్దరు అన్నయ్యలు అంతే. సుమారు 2013 నుండి రాజ్ తరుణ్ తో లావణ్య కి పరిచయం వుంది అని కూడా అంటున్నారు. అప్పట్లో మాధవీలత ఇంటికి కూడా అన్విక అదే లావణ్య, రాజ్ తరుణ్ తో వెళ్లినట్టుగా కూడా తెలిసింది. మాధవీలత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో వున్నారు.

ఇన్నేళ్ల తరువాత లావణ్య బయటకి వచ్చి రాజ్ తరుణ్ పై ఫిర్యాదు ఇవ్వడం ఆసక్తికరం. ఇప్పుడు రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని, తనని వదిలించుకోవాలని చూస్తున్నాడు అని, లావణ్య పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇంతకు ముందు ఒక డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి కూడా తెలిసిందే.

Updated Date - Jul 05 , 2024 | 10:26 PM