Natti Kumar: సినిమాటోగ్రఫీ.. చంద్రబాబు ముందుచూపుకు ఇది ఓ నిదర్శనం

ABN , Publish Date - Jun 14 , 2024 | 04:20 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా విడుదల చేసిన తన కేబినెట్ మినిస్టర్స్ జాబితాలో జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేష్‌కు టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖని కేటాయించారు. ఏపీ టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా నూతనంగా ఎంపికైన కందుల దుర్గేష్‌కు సీనియర్ నిర్మాత, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు.

Natti Kumar: సినిమాటోగ్రఫీ.. చంద్రబాబు ముందుచూపుకు ఇది ఓ నిదర్శనం
Kandula Durgesh and Natti Kumar

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తాజాగా విడుదల చేసిన తన కేబినెట్ మినిస్టర్స్ జాబితాలో జనసేన పార్టీ (Janasena Party)కి చెందిన కందుల దుర్గేష్‌ (Kandula Durgesh)కు టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖని (Tourism, Culture and Cinematography) కేటాయించారు. ఏపీ టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా నూతనంగా ఎంపికైన కందుల దుర్గేష్‌కు సీనియర్ నిర్మాత, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ (Natti Kumar) శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. నూతన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ (AP Cinematography Minister)పై తనకు ఎంతో నమ్మకం ఉన్నట్లుగా ఆయన ఈ ప్రకటనలో చెప్పుకొచ్చారు.

Also Read- Pawan Kalyan: పవన్‌కు డిప్యూటీ సీఎం‌తో పాటు కీలక శాఖలు


‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ తరపున నిడదవోలు నియోజకవర్గంలో విజయం సాధించిన కందుల దుర్గేష్‌కు రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉంది. సినీ పరిశ్రమకు చెందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) పార్టీకి చెందిన శాసనసభ్యుడికే టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) ముందుచూపుకు ఇది ఓ నిదర్శనం. టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలకు చక్కటి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. విశాఖపట్టణం, అరకు, రాజమండ్రి, గోదావరి తీరం, తిరుపతి, మదనపల్లి వంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలలో షూటింగులకు అనువుగా ఆ లొకేషన్స్‌ను తీర్చిదిద్దేందుకు తప్పకుండా కందుల దుర్గేష్‌ కృషిచేస్తారన్న నమ్మకం ఉంది.


Kandula-Durgesh.jpg

అలాగే చిన్న, పెద్ద సినిమా సమస్యలు, థియేటర్ల సమస్యలు, చిత్ర పరిశ్రమలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కందుల దుర్గేష్‌ పెద్ద పీట వేస్తారని విశ్వసిస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమ (Tollywood) నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 68 శాతం ఏపీ నుంచే వస్తోంది. మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమ తరపున ఆయనను కలుస్తాం’’ అని నట్టి కుమార్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 14 , 2024 | 04:20 PM