Natti Kumar: ఏపీలో కూటమిదే అధికారం

ABN , Publish Date - Jun 01 , 2024 | 10:05 PM

ఏపీ ఎన్నికల ఫలితాలపై శనివారం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అనంతరం కూడా చాలా మందిలో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఎందుకంటే కొన్ని సర్వేలు కూటమికి, మరికొన్ని సర్వేలు వైసీపీకి అన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటంతో అసలు విజయం ఎవరిదనేది తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు అనేలా పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో కూటమిదే అధికారం అన్నారు నిర్మాత నట్టి కుమార్.

Natti Kumar: ఏపీలో కూటమిదే అధికారం
Kutami Logo

ఏపీ ఎన్నికల ఫలితాలపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. శనివారం ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls 2024) అనంతరం కూడా చాలా మందిలో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఎందుకంటే కొన్ని సర్వేలు కూటమికి, మరికొన్ని సర్వేలు వైసీపీకి అన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటంతో అసలు విజయం ఎవరిదనేది తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు అనేలా పరిస్థితులు మారిపోయాయి. అయితే.. ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినా.. ఏపీలో అధికారం మాత్రమే కూటమిదే అని అన్నారు సీనియర్ నిర్మాత నట్టి కుమార్ (Producer Natti Kumar).

Also Read: Super Star Krishna Brother: ఈ ఫొటోలో ఉన్నది కృష్ణ కాదంటే ఎవరైనా నమ్మగలరా?


Natti-Kumar.jpg

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ నా వ్యక్తిగత అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో కూటమి (Kutami)దే అధికారం. బ్రహ్మాండమైన మెజార్టీతో కూటమి అధికారంలోకి రాబోతోంది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు 110 నుంచి 154 స్థానాలలో విజయం సాధించనున్నారు. కూటమి 22 ఎంపీ స్థానాలను, కాంగ్రెస్ 1 ఎంపీ స్థానం కైవసం చేసుకుంటాయి. కుప్పంలో చంద్రబాబు (Chandrababu) లక్షకు పై చిలుకు మెజార్టీతో, పిఠాపురంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లక్ష నుంచి లక్షా పదివేల మెజార్టీతో, మంగళగిరిలో నారా లోకేష్ (Nara Lokesh) 80 వేల పైన మెజార్టీతో గెలవబోతున్నారు. కూటమిలోని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి (CM)గా జూన్ 9న అమరావతిలో ఉదయం 10 గంటల 46 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - Jun 01 , 2024 | 10:05 PM