Natti Kumar: ఒక్కరే ఎలా నిర్ణయం తీసుకుంటారు.. థియేట‌ర్లు తెర‌వాల్సిందే!

ABN , Publish Date - May 15 , 2024 | 07:04 PM

ప‌ది రోజుల‌ పాటు థియేట‌ర్లను బంద్ చేస్తున్న‌ట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఈరోజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై నిర్మాత న‌ట్టి కుమార్ ప్రెస్మీట్ నిర్వ‌హించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Natti Kumar: ఒక్కరే ఎలా నిర్ణయం తీసుకుంటారు.. థియేట‌ర్లు తెర‌వాల్సిందే!
natti kumar

తాజాగా ఈ రోజు (బుధ‌వారం) ప‌ది రోజు పాటు థియేట‌ర్లను బంద్ చేస్తున్న‌ట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఈరోజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ న్యూస్‌తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ షాక్ గురైంది. దీనిపై సినిమా ఇండ‌స్ట్రీ నుంచే భిన్న‌మైన వాద‌న‌లు వస్తున్నాయి. ఈ విష‌య‌మై నిర్మాత న‌ట్టి కుమార్ (Natti Kumar) ప్రెస్మీట్ నిర్వ‌హించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంకా న‌ట్టి కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ సడెన్ గా షాక్ ఇచ్చిందని, ఆక్యుపెన్సీ లేదంటూ శుక్రవారం నుంచి థియేటర్స్ బంద్ అనడం ఏ మాత్రం ఆమోద యోగ్యం కాద‌న్నారు. నిర్మాతలతో చర్చించి నిర్ణ‌యం తీసుకొవాల్సి ఉంటుంద‌ని, నోటీస్ పీరియడ్ అనేది ఉండాలని అవేవి లేకుండా ఒక్కరే ఎలా నిర్ణయం తీసుకుంటారని, ఎన్నికల ఎఫెక్ట్ అనేది దేశమంతా ఉందని మండి ప‌డ్డారు.

natti kumar.jpg

రాజ‌కీయాలు, ఐపీఎల్ వ‌ళ్లే ప‌బ్లిక్‌ సినిమాల‌కు రావ‌డం లేద‌నేది వాస్త‌వ‌మేన‌ని, ఇప్పుడు ఆల్రేడీ విడుద‌లైన అన్ని సినిమాల‌కు ఈ స‌మ‌స్య చాలా ప్ర‌భావితం చూపిస్తోంద‌న్నారు. అయినా ఉన్న ఫ‌లంగా ఇప్పుడే ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెన‌క మ‌త‌ల‌బేంటి అని అన్నారు. ఈ నిర్ణ‌య‌మేదో నాలుగు నెల‌ల క్రిత‌మే తీసుకుంటే బావుండేద‌న్నారు. ఇప్ప‌టికే చిన్న నిర్మాతలు త‌మ చిత్రాల ప్ర‌మోష‌న్స్ చేసుకున్నార‌ని.. సడెన్ గా ఎల్లుండి నుంచి థియేటర్స్ మూసివేస్తే ఇబ్బంది అవుతుంద‌న్నారు. ఇలాంటి చర్యలతో తీవ్ర నష్టం వాటిళ్లుతుంద‌ని అంతేగాక ఆడియన్స్ ఓటీటీలకు జ‌నం ఇంకా ఎడిక్ట్ అవుతారన్నారు. మరలా థియేటర్స్ ఓపెన్ చేశాకా ఆడియన్స్ వస్తారా అని అన్నారు. మీ వల్ల నిర్మాతలకు, మల్టీప్లెక్స్ లకు ఇబ్బందే అన్నారు. అయితే పెద్ద సినిమాల రిలీజ్‌ ఉన్న‌ప్పుడే థియేట‌ర్స్ ఒపెన్ చేసి త‌ర్వాత బంద్ చేయండని హిత‌వు ప‌లికారు.


ఎవ‌రో ఒక‌రిద్ద‌రి నిర్మాత‌ల కోసం కావాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని, చిన్న సినిమాల‌ను బ‌త‌క‌నీయ‌డం లేద‌న్నారు. జూన్ 7న క‌ల్కి సినిమా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు అన్నీ చిన్న సినిమాలే రిలీజుకు ఉన్నాయ‌న్నారు. పెద్ద సినిమాల‌ప్పుడు థియేట‌ర్స్ ఓపెన్ చేస్తామన‌డం స‌బ‌బు కాద‌ని.. సినిమాల విష‌యంలో చిన్నా,పేద అనే తేడా చూపించొద్ద‌న్నారు.. చిన్న సినిమాలే థియేట‌ర్ల‌ను బ‌తికిస్తున్నాయ‌న్నారు. ఇక‌నైనా నిర్మాత‌లు, థియేట‌ర్స్ ఓన‌ర్స్ మ‌రోసారి క‌లిసి మ‌ట్గాడుకుని థియేట‌ర్స్ బంద్ చేయాల‌నే నిర్ణ‌యాన్ని వెన‌క‌కు తీసుకోవాల‌న్నారు.

Updated Date - May 15 , 2024 | 07:18 PM