Natti Kumar: ప్రజలు విసిగిపోయారు.. అందుకే సాగనంపుతున్నారు!

ABN , Publish Date - May 23 , 2024 | 05:59 PM

"సినిమా ఇండస్ట్రీ ఎక్కడకు పోతుంది? సినిమాటోగ్రఫి మంత్రి ఎఫ్‌డీసీ ఛైర్మన్ ను ఎందుకు నియమించలేదు? కేసీఆర్‌ పాలనలో ఇండస్ట్రీని  పట్టించుకున్నది లేదు. కేసీఆర్‌ నియంత పాలన చేశాడు. రేవంతరెడ్డి ప్రజాపాలన చేయాలి’’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్  నట్టి కుమార్‌ అన్నారు.

Natti Kumar: ప్రజలు విసిగిపోయారు.. అందుకే సాగనంపుతున్నారు!

"సినిమా ఇండస్ట్రీ ఎక్కడకు పోతుంది? సినిమాటోగ్రఫి మంత్రి ఎఫ్‌డీసీ ఛైర్మన్ ను  (FDC Chairman)ఎందుకు నియమించలేదు? కేసీఆర్‌ (kcr) పాలనలో ఇండస్ట్రీని  పట్టించుకున్నది లేదు. కేసీఆర్‌ నియంత పాలన చేశాడు. రేవంతరెడ్డి ప్రజాపాలన చేయాలి’’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్  నట్టి కుమార్‌ (Natti kumar) అన్నారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ "ఎఫ్‌డీసీ చైర్మన్‌గా సినిమా వారే ఉండాలి. ఇది మా విన్నపం. సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉన్నవారు పరిస్థితులను అర్థం చేసుకుని సమస్యల్ని పరిష్కరించడం సులభంగా మారుతుంది. గతంలో ఉన్న అనీల్‌ కూర్మాచలం అని ఎవరో మాకు తెలీదు. మేము వారికి తెలీదు. బసిరెడ్డి లాంటి సినీ పరిశ్రమకు సేవలు చేసిన వారిని ఛైర్మన్గా నియమించవచ్చు’’ అని సూచించారు.

అలాగే డ్రగ్స్‌ మాఫియ, చిత్రపురి కాలనీ కుంభకోణం గురించి కూడా ఆయన మాట్లాడారు. "అసలు ఈ డ్రగ్స్‌ మాఫియా సినిమా పరిశ్రమకు ఎందుకు? ఒకరు చేసిన పనికి ఇండస్ట్రీ  మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. సినిమా వాళ్లను బయట చీప్‌గా చూస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్  దీనిపై యాక్షన్   తీసుకోవాలి. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. హేమ తప్పు చేేస్త పోలీసులు వివారించాలి. కర్నాటకలో ఇండస్ట్రీ పరువు తీసింది. ుమా’ అధ్యక్షుడు విష్ణు ఏ యాక్షన్‌ తీసుకుంటున్నారు? రేవ్‌ పార్టీ కేసులో ఎవరున్నారు అన్నది పోలీసులు వెల్లడిస్తారు. అనంతరం వారిపై ఏ యాక్షన్‌ తీసుకోవాలో మా, ఛాంబర్‌ పెద్దలు నిర్ణయం తీసుకోవాలి.

దోచుకుని దాచుకున్నారు...
గత ప్రభుత్వం వల్ల చిత్రపురి కాలనీ లో అవకతవకలు జరిగాయి. దోచుకుంది, దాచుకుంది కేసిఆర్‌ ఫ్యామిలీనే.వందలకోట్లు దండుకుని, బ్లాక్‌లో ఇళ్లను అమ్ముకున్నారు. ఇవన్నీ బయటకు తెలియాలంటే ఎఫ్‌డీసీ చైర్మన్‌ ఉండాలి. ఈ కుంభకోణాన్ని రేవంత్ రెడ్డి వెలికి తీయాలి. నైజాం ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అనేది గుర్తింపు లేని బాడీ. నైజాంలో మెజారిటీ ఎగ్జిబిటర్స్‌ దిల్‌ రాజు, ఏషియన మైత్రీ ఈ ముగ్గురే ఉన్నారు. 5 శాతం మాత్రమే ఓన్‌ ఽథియేటర్స్‌ ఓనర్స్‌ ఉన్నారు. మరీ ఎవరి కోసం థియేటర్స్‌ మూసి పర్సంటేజ్‌ పెంచాలంటున్నారు. ఏ థియేటర్స్‌ బంద్‌ ఉన్నాయో కనిపించటం లేదు. కావాలని నిర్మాతలను ఇబ్బంది పెట్టడానికి బంద్‌ అంటున్నారు. ఐకమత్యంతో సమస్యలు సాల్వ్‌ చేసుకోవాలి తప్పితే... ఇండస్ట్రీకి  ఇబ్బంది కలిగేలా చెయ్యెద్దు. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే మరలా ఎఫ్‌డీసీ ఛైర్మన్  కావాలి. ఏపీలో ఎఫ్‌డీసీకి పోసాని ఉన్నా ఉపయోగం లేదు. జూన్‌ 4 తరువాత ఏపీలో సినీ ఇండస్ట్రీ   కళకళలాడుతుంది.

జగన్ రెడ్డి లాగా  వద్దు...
బెనిఫిట్‌ షో అనేవి దళారులకు లాభం. దాని వల్ల నిర్మాతలకుచ, ఎగ్జిబిటర్‌లకు ఏ ఉపయోగం లేదు. ప్రభుత్వం, పోలీసులు న్యాయం ఏదో తెలుసుకుని అనుమతులు ఇవ్వాలి. భవిష్యత్తులో టికెట్‌ రేట్‌ పెంచకుండా సీఎం రేవంత్‌ గారు, కోమటిరెడ్డిగాఉ జాగ్రత్తలు తీసుకోవాలి. పేదవాడు మల్టీప్లెక్స్‌ లో సినిమా చూేసలా ఉండాలి. జగన్‌ రెడ్డిలాగా రూ.5 రూ టికెట్‌ పెట్టమని అడగటం లేదు. జగన్‌లాగా సినిమా వారిని అవమానించమని చెప్పటం లేదు. కేసిఆర్‌, జగన్‌ అరాచక పాలన చూసి విసిగిపోయాం. అందుకే ప్రజలు తెలంగాణలో ఒకరిని సాగనంపారు. ఆంధ్రాలో  సాగనంపడానికి రెడీ అయ్యారు.

Updated Date - May 23 , 2024 | 05:59 PM