Pawan Kalyan: తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలివే..

ABN, Publish Date - Jun 28 , 2024 | 04:16 PM

ఏపీ ఎన్నికలలో విజయానంతరం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన పవన్ కళ్యాణ్.. శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తోన్నట్లుగా శుక్రవారం తెలంగాణ జనసేన నేతలు మీడియాకు తెలియజేశారు.

Janasena Telangana Leaders Press Meet

ఏపీ ఎన్నికలలో విజయానంతరం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా (AP Deputy CM) పదవి చేపట్టిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి (Kondagattu Anjaneya Swamy Temple) ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తోన్నట్లుగా శుక్రవారం తెలంగాణ జనసేన నేతలు మీడియాకు తెలియజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో తెలంగాణ జనసేన ప్రచార కమిటీ ఛైర్మన్ ఆర్కే సాగర్ (RK Sagar) నేతృత్వంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ తెలంగాణ నేతలు శంకర్ గౌడ్, గ్రేటర్ నాయకులు రాజలింగం, కూకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఉమా రెడ్డి ప్రేమ్ కుమార్, నాయకులు దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read- Kalki 2898AD: 'కల్కి 2898 ఏడి' లో కైరా పాత్రలో నటించిన ఈ నటి గురించి తెలుసా...


పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన వివరాలివే.. (Pawan Kalyan Kondagattu Tour)

శనివారం ఉదయం 7గంటలకు మాదాపూర్‌లోని తన నివాసం నుంచి కొండగట్టుకు పవన్ కళ్యాణ్ బయలుదేరుతారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రోడ్డు మార్గాన కొండగట్టుకు జనసేన అధినేత వెళ్తున్నారని ఆర్కే సాగర్ తెలిపారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు అందరూ పోలీసులకు సహకరించాలి ఆయన విజ్ఞప్తి చేశారు.


తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా సాగర్ తెలిపారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరుపున పోరాటం కొనసాగుతూనే ఉంటుందని జనసేన నాయకులు వివరించారు. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నామని తెలిపారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని… ఏపీలో జనసేన విజయం తెలంగాణపై ఉంటుందని వారు వివరించారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా.. ఇతర పార్టీల వారు జనసేనలో చేరుతామని తమను సంప్రదిస్తున్నారని నాయకులు వివరించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటిచేయాలని పవన్‌ను కోరుతామని వారు తెలిపారు. జనసేనలో పనిచేయటానికి యువత ఉత్సాహంగా ఉన్నారని.. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని విస్తరించేందుకు ఎల్లప్పుడు సిద్దంగా ఉంటామని జనసేన తెలంగాణ నాయకులు స్పష్టం చేశారు. (Janasena Telangana Leaders Press Meet)

Read Latest Cinema News

Updated Date - Jun 28 , 2024 | 04:16 PM