Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంను కలవబోతోన్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎందుకంటే?

ABN , Publish Date - Jun 23 , 2024 | 05:22 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని కోరేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ని కలవబోతున్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు. విజయవాడ‌లోని క్యాంప్ ఆఫీసులో సోమవారం మధ్యాహ్నం ఈ భేటీ ఉండబోతోంది.

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంను కలవబోతోన్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎందుకంటే?
AP Deputy CM Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి (Kutami) ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని కోరేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ (AP Deputy CM Pawan Kalyan)ని కలవబోతున్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు (Tollywood Producers). విజయవాడ‌లోని క్యాంప్ ఆఫీసులో సోమవారం మధ్యాహ్నం ఈ భేటీ ఉండబోతోంది.

Also Read-Pawan Kalyan: ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట


Tollywood-Logo.jpg

ఈ సమావేశంలో.. మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో టాలీవుడ్‌కు చెందిన నిర్మాతలు చర్చించనున్నారని తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిసే వారిలో డి.వి.వి. దానయ్య, అశ్వనీ‌దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్; సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్; తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్ తదితరులు ఉండనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 23 , 2024 | 05:48 PM