Mechanic Rocky: మెట్రో మాస్.. దీపావళి క్రాకర్
ABN, Publish Date - Jul 28 , 2024 | 10:38 PM
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌ను SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని ఫస్ట్ గేర్ పేరుతో మేకర్స్ ఆదివారం విడుదల చేశారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌ను SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి (Ram Talluri) నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) మధ్య ట్రయాంగిల్ లవ్‌ను ప్రజెంట్ చేస్తూ.. సినిమాలోని కీలక పాత్రలను రివీల్ చేసేలా ఈ ఫస్ట్ గేర్‌ను డిజైన్ చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Mechanic Rocky First Gear)
Also Read- Maruthi Nagar Subramanyam Trailer: నవ్వకుండా ఉండగలరేమో.. ట్రై చేయండి
ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అందరికీ బోనాలు పండగ శుభాకాంక్షలు. ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. ఈ ఏడాది చాలా స్పెషల్. నా నుంచి మూడో సినిమా కూడా రాబోతోంది. ‘మెకానిక్ రాకీ’ అవుట్ పుట్ ఇంత గ్రాండ్‌గా రావడానికి కారణం నిర్మాత రామ్ తాళ్లూరి. దర్శకుడు రవితేజ చాలా ట్యాలెంటెడ్. సినిమా మీద పాషన్‌తో వచ్చారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. మనోజ్ ఇండియాలో టాప్ డీవోపీ అవుతాడు. శ్రద్దా కెరీర్‌లో ఇది బెస్ట్ లుక్ అనిపించింది. మంచి క్యారెక్టర్. మీనాక్షి వండర్ ఫుల్ కో స్టార్. తనకి గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. ఇది బ్యూటీఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ. జేక్స్ బిజోయ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి సాంగ్ బ్లాక్‌బస్టర్ అయ్యే ఆల్బం ఇచ్చాడు. చాలా న్యూ ఏజ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది గ్లింప్స్ మాత్రమే. ముందుముందు చాలా రాబోతున్నాయి. మలక్ పేట్ బ్యాక్ డ్రాప్ వుండే కథ ఇది. నా క్యారెక్టర్ చాలా కనెక్టింగ్ వుంటుంది. చాలా మంచి కామెడీ టైమింగ్ వుంటుంది. ఇది రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. మెట్రో మాస్ అనుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్‌టైన్ చేస్తుందీ చిత్రం. ఇది దీవాళి క్రాకర్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండని అన్నారు. (Mechanic Rocky Glimpse)
నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. మెకానిక్ రాకీ మంచి మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అక్టోబర్ 31న మీ ముందుకు వస్తున్నాం. మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. రవితేజ కొత్త దర్శకుడైనా చాలా గొప్పగా తీశాడు. విశ్వక్ గారి ఎనర్జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంచి రోల్ చేస్తున్నారు. మీ అందరికీ నచ్చుతుందని తెలపగా.. దర్శకుడు రవితేజ మాట్లాడుతూ.. జేక్స్ బిజోయ్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రామ్ తాళ్లూరి, హీరో విశ్వక్‌కు ధన్యవాదాలు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, సునీల్ వంటి వారంతా చాలా అద్భుతమైన యాక్టర్స్. వారంతా ఎంతగానో సపోర్ట్ చేశారు. తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే చిత్రంగా ఈ సినిమా నిలబడుతుందని తెలిపారు. ఇందులో నేను చేస్తున్న క్యారెక్టర్ చాలా రిలేటబుల్‌గా ఉంటుందని అన్నారు హీరోయిన్ మీనాక్షి చౌదరి.
Read Latest Cinema News