Mechanic Rocky: ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:17 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గ్లింప్స్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

Mechanic Rocky Movie Still

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రూపుదిద్దుకుంటోన్న మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky Movie). నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi) రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి (Ram Talluri) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం గ్లింప్స్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Raayan Review: రాయన్  రివ్యూ.. ధనుష్ 50వ చిత్రం ఎలా ఉందంటే.. 

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. జూలై 28న ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్‌ని లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో విశ్వక్ సేన్ లుక్ వావ్ అనేలా ఉంది. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్‌ (Shraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Mechanic-Rocky.jpg

హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) సంగీతం అందిస్తుండగా.. మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Vishwak-Mechanic-Rocky.jpg

Read Latest Cinema News

Updated Date - Jul 26 , 2024 | 10:17 PM

Mechanic Rocky: దీపావళికి వ‌స్తోన్న విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'

Vishwak Sen : ఆవేశంతోనో.. అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదు!

Vishwak sen : పేరు ప్రస్తావించకుండా ఏకేశాడు...

Vishwak Sen: భగవద్గీత తాత్పర్యం  శాశ్వతంగా నిలిచిపోతుంది

Vishwak Sen: అన్ని రంగాల్లో అమ్మాయిలు వుండాల‌నేది నా కోరిక‌.. ఈ టీమ్‌ను చూస్తే ముచ్చ‌టేసింది