Vishwak Sen: భగవద్గీత తాత్పర్యం  శాశ్వతంగా నిలిచిపోతుంది

ABN , Publish Date - Mar 11 , 2024 | 04:17 PM

నేటి తరంతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం చాలా అద్భుతంగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప కార్యం. శాశ్వతంగా నిలబడిపోతుంది' అన్నారు హీరో విశ్వక్ సేన్

Vishwak Sen:  భగవద్గీత తాత్పర్యం  శాశ్వతంగా నిలిచిపోతుంది

'నేటి తరంతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం చాలా అద్భుతంగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప కార్యం. శాశ్వతంగా నిలబడిపోతుంది' అన్నారు హీరో విశ్వక్ సేన్.  సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ రికార్డ్ చేసిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప దర్శనం అధ్యాయం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ "భగవద్గీత విశ్వరూప దర్శనం అధ్యాయం లాంచ్ చేయడం నా అదృష్టం.  కేవలం పాడ్ కాస్ట్ లా వినొచ్చేమో అనుకున్నాను, కానీ విజువల్ కూడా చాలా కేర్ తీసుకొని అద్భుతంగా చేశారు. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంను చాలా చక్కగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప కార్యం. ఇది శాశ్వతంగా నిలబడిపోతుంది' అన్నారు.

Rp-2.jpg
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ  "భగవంతుడే నా చేత ఈ కార్యాన్ని చేయించాడు. నేను కేవలం నిమిత్తమాత్రుడినే. స్వామి ముకుందనంద రాసిన భగవద్గీత అందరికీ సులువుగా అర్ధమైయ్యేలా వుంటుంది. వారి అనుమతితోనే రికార్డ్ చేశాను. ఈ ప్రయాణంలో ఎంతగానో తోడ్పడిన దివాకర్ గారికి ధన్యవాదాలు. జానకీరామ్ గారు అద్భుతమైన విజువల్స్ చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. ఈ వేడుకు పెట్టడానికి కారణం కూడా జానకీరామ్.   మన పురాణాలన్నిటిని తన బొమ్మలతో ప్రపంచానికి చెప్పే మెగా ప్రాజెక్ట్ చేయబోతున్నారాయన. ఆయనకు మనవంతుగా సపోర్ట్ చేయాలని ఈ వేడుక ద్వారా కోరుతున్నాను. నా వంతుగా లక్ష రూపాయిలు ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం మౌళి చాలా కష్టపడ్డాడు. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. భగవద్గీత మన బ్రతుకు మొదలుపెట్టినపుడు వినాల్సినది. జీవితాన్ని మీరు ఎలా కావాలని కోరుకుంటున్నారో అలా తీసుకెళుతుంది. యూత్ ని ద్రుష్టిలో పెట్టుకొని చేసిన భగవద్గీత ఇది. అందుకే ఈ వేడుకకు ఒక యూత్ హీరో అతిధిగా వుండాలని విశ్వక్ ని పిలిచాం. ఆయన వచ్చి వేడుకలో పాల్గోవడం చాలా అనందంగా వుంది. సంపూర్ణ భగవద్గీతను తాత్పర్యంతో రికార్డ్ చేశాం. దేవుడు కల్పించిన ఈ అవకాశంను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.

దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ... భగవద్గీత ఆర్పీ పట్నాయక్ గారు తాత్పర్యంతో రికార్డ్ చేస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఇది చాలా బావుంది. చిరకాలం నిలిచిపోయే ప్రాజెక్ట్'' అన్నారు. జెకె భారవి, రఘు కుంచె, సింగర్ కౌశల్య, జెమిని సురేష్ పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Updated Date - Mar 11 , 2024 | 04:17 PM