Kannappa: ‘కల్కి’నే కాదు.. ‘కన్నప్ప’ తిన్నడు ఉపయోగించే విల్లుకూ ఓ కథ ఉంది.. అదేంటంటే?

ABN, Publish Date - Jul 10 , 2024 | 08:32 PM

ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 AD’ చిత్రంలోని విల్లుకు ఓ చరిత్ర ఉన్నట్లుగా, ముఖ్యంగా అర్జునుడు వాడిన గాండీవం అనేలా మేకర్స్ అందులో చూపించారు. ఇప్పుడు ‘కల్కి’లోనే కాదు.. నా ‘కన్నప్ప’ సినిమాలోని విల్లుకు ఓ విశేషం ఉందని అంటున్నారు మంచు విష్ణు. ఆయన ప్రధాన పాత్రలో డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’. తాజాగా ఇందులోని విల్లు విశిష్టతను తెలియజేస్తూ విష్ణు వీడియో విడుదల చేశారు.

Kannappa Movie Still

ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా వచ్చిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) చిత్రంలోని విల్లుకు ఓ చరిత్ర ఉన్నట్లుగా, ముఖ్యంగా అర్జునుడు వాడిన గాండీవం అనేలా మేకర్స్ అందులో చూపించారు. ఇప్పుడు ‘కల్కి’లోనే కాదు.. నా ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలోని విల్లుకు ఓ విశేషం ఉందని అంటున్నారు మంచు విష్ణు (Manchu Vishnu). ఆయన ప్రధాన పాత్రలో డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’. రీసెంట్‌గా వచ్చిన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. తాజాగా విష్ణు తన ‘కన్నప్ప’ సినిమాలో భాగంగా వాడిన విల్లు విశిష్టతను చెప్పుకొచ్చారు. (Kannappa Bow History)

Also Read- Bharateeyudu 2: ‘భార‌తీయుడు 2’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..

‘‘ ‘కన్నప్ప’ సినిమాలో తిన్నడు వాడిన విల్లు కేవలం ఆయుధం మాత్రమే కాదు. ఆ ధనస్సు ధైర్యానికి సూచిక. తండ్రీకొడుకుల మధ్య బంధానికి సూచికగా నిలుస్తుంది. కన్నప్ప తండ్రి నాధనాథ తన చేతులతో తయారు చేసిన ఆ విల్లు కుటుంబ వారసత్వంగా మారింది. ఆ విల్లుతో కన్నప్ప యుద్ధభూమిలో అసమానమైన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తారు. కేవలం ఐదేళ్ల వయసున్న కన్నప్ప అనే యువకుడు ఓసారి అడవిలో క్రూరమైన పులిని ఎదుర్కొంటాడు. ఒక సాధారణ కర్రతో పోరాటం చేసి ఆ పులి నుంచి తప్పించుకుంటాడు. అంత చిన్న వయసులో తన కొడుకు ధైర్య సాహసాల్ని చూసి నాధనాథుడు మురిసిపోతాడు. కన్నప్ప శౌర్యానికి ప్రతీకగా ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ పులి ఎముకలు, దంతాలతో చేసిన ఆ విల్లు బలానికి, ధైర్య సాహసాలకి ప్రతీకగా నిలుస్తుంది. ఆ విల్లుని రెండుగా విరిస్తే యుద్దంలో పోరాడేందుకు కత్తుల్లానూ ఉపయోగపడేలా రూపొందించారని విష్ణు చెప్పుకొచ్చారు. ఇది సినిమాలోని కథ.


వాస్తవానికి వస్తే.. ఈ కథని శ్రద్దగా విన్న న్యూజిలాండ్‌లోని చిత్ర కళా దర్శకుడు క్రిస్ ప్రత్యేకమైన విల్లుని తయారు చేయడం విశేషం. ‘కన్నప్ప’ సినిమా కథకు, విజన్‌కు అనుగుణంగా.. విష్ణు మంచు అంచనాలకు తగ్గట్టుగా ఆ ధనస్సుని రూపొందించారు క్రిస్. ఈ విల్లుతోనే న్యూజిలాండ్‌లో రెండు నెలల పాటు చిత్రీకరణ జరిపారు.

ఇంకా విష్ణు మంచు (Vishnu Manchu) మాట్లాడుతూ.. ‘‘ఈ తిన్నడు విల్లు కన్నప్పలో అంతర్భాగం అయింది. అతను దాన్ని అచంచలమైన గర్వంతో ఉపయోగిస్తూ.. తన తెగను, అడవిలో సమతుల్యతను కాపాడుకుంటాడు. ఈ కథ యువతలో ధైర్యాన్ని నింపుతుంది, విన్న వారందరిలో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది. మేము అనుకున్నదాన్ని అనుకున్నట్టుగా రూపొందించినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి ముఖేష్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి ప్రఖ్యాత నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. శివుని భక్తుడైన ‘భక్త కన్నప్ప’ కథను వైవిధ్యభరితంగా ఈ ‘కన్నప్ప’లో చెప్పుబోతున్నారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 10 , 2024 | 08:32 PM