Kannappa : కదిలొచ్చిన కన్నప్ప

ABN , First Publish Date - 2023-11-24T01:05:28+05:30 IST

మహాశివుడి ప్రియ భక్తుడు కన్నప్ప గాథను తెరపైకి తీసుకొస్తున్నారు విష్ణు మంచు. ఆయన టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. గురువారం విష్ణు పుట్టిన రోజు...

Kannappa : కదిలొచ్చిన కన్నప్ప

మహాశివుడి ప్రియ భక్తుడు కన్నప్ప గాథను తెరపైకి తీసుకొస్తున్నారు విష్ణు మంచు. ఆయన టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. గురువారం విష్ణు పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ‘కన్నప్ప’ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. భారీ శివలింగం ఎదుట గాల్లో ఎగురుతూ విల్లును ఎక్కుపెడుతున్న యోధుడిగా విష్ణు లుక్‌ అద్భుతంగా ఉంది. ‘‘కన్నప్ప’ సినిమా కోసం మా సర్వశక్తులు ధారపోస్తున్నాం. ఆ భక్తుడి గాథను తెరపైకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. దృశ్యకావ్యంలా తీర్చిదిద్దుతున్నాం. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’ అని విష్ణు చెప్పారు. భారీ తారాగణంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రభాస్‌, మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌కుమార్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముఖేశ్‌కుమార్‌ దర్శకుడు. న్యూజిలాండ్‌లో చిత్రీకరణ చేస్తున్నారు.

Updated Date - 2023-11-24T01:05:30+05:30 IST