Kannappa : శివుడిగా ప్రభాస్‌.. నిజమేనా.. విష్ణు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-09-10T12:09:02+05:30 IST

‘కన్నప్ప’ చిత్రం మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఎంతోకాలంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని శ్రీకాళహస్తి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Kannappa : శివుడిగా ప్రభాస్‌.. నిజమేనా.. విష్ణు ఏమన్నారంటే..

‘కన్నప్ప’(Kannappa) చిత్రం మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఎంతోకాలంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని శ్రీకాళహస్తి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ (mukesh kumar singh) దర్శకత్వం వహించనున్నారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించనున్నారని టాక్‌ నడుస్తోంది. ఆ పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉండబోతోందని కూడా వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. ‘హర హర మహాదేవ్‌’ అని ట్వీట్‌ చేశారు.

దీనిని చూసిన అభిమానులు.. ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌ ఈశ్వరుడిగా కనిపించనున్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో నుపుర్‌ సనన్‌ కథానాయిక. ‘‘మహాకవి దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ చలన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగిందని, ప్రస్తుతం అక్కడి పరిసరాల్లో సినిమా తీయడం వీలు కాదు. అందుకోసం ఈ చిత్ర నిర్మాణానికి ఆర్నెలపాటు న్యూజిల్యాండ్‌కు వెళ్తున్నాం. కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ కథకి కీలకమైన మెరుగులు దిద్దారు. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అని సినిమా ప్రారంభం రోజు మంచు విష్ణు చెప్పారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందించనున్నారు.

Updated Date - 2023-09-10T12:19:21+05:30 IST