Vidudala Part 2: ‘విడుదల 2’ ఫస్ట్ లుక్.. ఈసారి అంతకుమించి!

ABN, Publish Date - Jul 17 , 2024 | 01:45 PM

నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన ‘విడుదల పార్ట్ 1’ థియేట్రికల్‌గా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్ర మొదటి పార్ట్ సాధించిన విజయంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు ‘విడుదల 2’ విడుదల అవుతుందా? అని పార్ట్ 2 రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. తాజాగా పార్ట్ 2 ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Vidudala Part 2 First Look

నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) రూపొందించిన ‘విడుదల పార్ట్ 1’ (Vidudala Part 1) థియేట్రికల్‌గా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్ర మొదటి పార్ట్ సాధించిన విజయంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు ‘విడుదల 2’ విడుదల అవుతుందా? అని పార్ట్ 2 రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), సూరి (Soori) ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల 2’ (Vidudala Part 2) ఫస్ట్ లుక్‌ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తెలుగు, తమిళంలో ‘విడుదల 2’ ఫస్ట్ లుక్ రిలీజైంది. (Vidudala 2 First Look Released)

Also Read- Game Changer: అప్డేట్స్ లేవ్.. లీక్స్‌తోనే పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్


‘విడుదల 2’ (Vidudala 2 Movie) ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. గాయపడిన సింహం వేటకు బయలుదేరినట్లుగా విజయ్ సేతుపతి ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ముఖమంతా నెత్తుటి మరకలతో ఉండగా.. కత్తు పట్టుకుని గర్జిస్తున్నట్లుగా ఆయన వస్తున్న ఈ లుక్.. సెకండ్ పార్ట్‌పై మరింతగా హైప్‌ని పెంచుతోంది. ఈ పోస్టర్‌తో పాటు మరో స్టిల్‌‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్‌లో ఫ్యామిలీ టచ్‌ని చూపించారు. విజయ్ సేతుపతి, మంజువారియర్ సరదాగా మాట్లాడుకుంటూ ఓ పచ్చని పొలంలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ రెండు పిక్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


‘విడుదల 2’ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత ఎల్రెడ్ కుమార్ (Elred Kumar) మాట్లాడుతూ.. ‘విడుదల పార్ట్ 1’ సినిమాను ఆదరించి బిగ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ మూవీ సక్సెస్ మా టీమ్ అందరికీ ఎంతో సంతోషాన్నిచ్చింది. ‘విడుదల పార్ట్ 1’ మూవీ అంచనాలు మించి విజయం సాధించింది. కమర్షియల్ అంశాలతో పాటు రియలిస్టిక్ అప్రోచ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ తరం దర్శకులకు స్ఫూర్తినిచ్చింది. యాక్టర్ సూరికి విడుదల పార్ట్ 1 మూవీ సక్సెస్ ఎంతో పేరు తెచ్చింది. విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ ‘మహారాజ’ తర్వాత వస్తున్న చిత్రంగా ‘విడుదల 2’పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ‘విడుదల పార్ట్ 1’ను మించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ‘విడుదల 2’ సినిమాను తీసుకొస్తున్నాం. దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను తనదైన శైలిలో తీర్చిదిద్దుతున్నారు. స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం ‘విడుదల 2’ మూవీకి మరో ఆకర్షణ. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా ట్రైలర్, ఆడియో, థియేట్రికల్ రిలీజ్ డేట్స్‌ను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 17 , 2024 | 01:45 PM