Vijay Sethupathi: పెద్ద స్థాయికి వెళ్లాలి కానీ.. దారి ఎలాగో తెలీదు.. విజయ్‌ భావోద్వేగం!

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:11 PM

ఆయనొక హీరో.. కానీ సాదాసీదాగా కనిపిస్తారు. హీరో అనే పొగరు, సెలబ్రిటీ అనే గర్వం.. స్టార్‌ అనే దర్పం కించిత కూడా కనిపించదు. పాత్ర నచ్చితే హీరోగానే కాదు.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అయిన చేయడానికి వెనకాడరు.

Vijay Sethupathi:  పెద్ద స్థాయికి వెళ్లాలి కానీ.. దారి ఎలాగో తెలీదు.. విజయ్‌ భావోద్వేగం!

ఆయనొక హీరో.. కానీ సాదాసీదాగా కనిపిస్తారు.
హీరో అనే పొగరు, సెలబ్రిటీ అనే గర్వం..
స్టార్‌ అనే దర్పం కించిత కూడా కనిపించదు.
పాత్ర నచ్చితే హీరోగానే కాదు.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అయిన చేయడానికి వెనకాడరు.
అలా చేసిన మెప్పించిన చిత్రాలు చాలానే ఉన్నాయి.
ఇలాంటి క్వాలిటీస్‌ ఉన్న నటులు అరుదుగా ఉంటారు.

అలాంటి వారిలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi)ఒకరు. ఆయనకున్న స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరితో సౌమ్యంగా ఉంటారు. 'ఉప్పెన’లో (Uppena) రాయణం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్‌ సేతుపతి. ప్రస్తుతం ‘మహారాజ’తో 9Maharaja)మరో హిట్‌ను అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషనలో భాగంగా సుహాస్‌ చేసిన ఇంటర్వ్యూలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 'ప్రజెంట్‌ మీరు ఎవర్ని మిస్‌ అవుతున్నారు’ అని సుహాస్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తనకు తానే మిస్‌ అవుతున్నానని చెప్పారు. జీవితంలో ఆయన ఏం మిస్‌ అయ్యారో చెప్పుకొచ్చారు. ఆయన మాటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సుహాస్‌ ప్రశ్నకి విజయ్‌ తన అంతరంగాన్ని ఇలా చెప్పుకొచ్చారు. (Vijay sethupathi emotional interview)

Vijay.jpg

‘‘అప్పట్లో ఓ కుర్రాడు ఉండేవాడు.. చాలా అమాయకుడు. ఏ కలలు లేనివాడు.  జీవితంలో ఏం చేయాలో కూడా తెలియని వాడు.  ఇంటర్‌ ఫస్ట్‌ ఈయర్‌ చదువుతున్నప్పుడు సెకండ్‌ ఇయర్‌ సిలబస్‌ ఏంటి అనేది కూడా తెలియని అబ్బాయి అతను. ఫ్రెండ్స్‌ అందరూ ఇది సెకండ్‌ ఈయర్‌ సిలబస్‌ అని చెబితే కానీ అతనికి తెలియదు. చదువు, ఆటలు ఇలా ఎందులోనూ అతను తోపు కాదు.. కాలేజీ రోజుల్లో కనీసం అమ్మాయితో కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అంతగా అతనికి సిగ్గు.. కానీ లైఫ్‌లో ఏదో పెద్దగా సాధించాలని, పెద్ద స్థాయికి వెళ్లాలని కోరిక.. కానీ అది ఎలా చేయాలో.. దానికి దారెటో కూడా తెలీదు. పెద్దగా కోరికలు, కలలు కూడా ఏమీ ఉండేవి కాదు. కేవలం తన అనుభవిస్తున్న పేదరికం నుంచి బయటపడాలి అనుకునేవాడు అంతే!. ఆ కుర్రాడు ఇప్పుడు లేడు.. వాడు చాలా క్యూట్‌.. వాడినే నేను మిస్‌ అవుతున్నా, నన్ను నేనే ఇప్పుడు మిస్‌ అవుతున్నాను’’ అంటూ విజయ్‌ ేసతుపతి భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఆయన మాటలకు నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు.  ప్రతి మధ్యతరగతి కుర్రాడి మాటలే మీ నోటి నుంచి వచ్చాయి అంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. సినిమాలైనా, బయటైనా.. ఏది ఏమైనా విజయ్‌సేతుపతి మాత్రం నిజంగా స్పెషల్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Updated Date - Jun 15 , 2024 | 05:42 PM