Nindha Trailer: ‘నింద’ ట్రైలర్.. మ్యాటర్ ఉన్నట్లే ఉంది..
ABN, Publish Date - Jun 11 , 2024 | 10:13 PM
టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా సమాజాన్ని ప్రశ్నించేలా, తట్టిలేపేలా ఉంటుందనేది తెలుస్తోంది.
వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నింద’ (Nindha). ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం (Rajesh Jagannadham) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న విడుదల కాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలిపారు. అలాగే ఈ మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టుకున్నాయి. మైత్రీ మూవీస్ (Mythri Movies) ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరోలు విశ్వక్ సేన్ (Vishwak Sen), సందీప్ కిషన్ (Sundeep Kishan)లు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. (Nindha Trailer Released)
Also Read- Ap Cm Oath Ceremony: జూనియర్ ఎన్టీఆర్‌కు అందని ఆహ్వానం..
ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ సినిమా సమాజాన్ని ప్రశ్నించేలా, తట్టి లేపేలా ఉండబోతుందనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ‘మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టు’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో.. ‘మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం’, ‘అబద్దాన్ని బలంగా చెప్పినంత మాత్రాన నిజం అయిపోదు’, ‘బలవంతుడిదే రాజ్యం అని అనుకోవడానికి మనమేమీ అడవుల్లో బతకడం లేదు’ అనే డైలాగ్స్ ఆకర్షిస్తున్నాయి. అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన కేసు చుట్టూ కథ తిరుగుతుండటం, అసలు నేరస్తుడు ఎవరు? అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠ భరితంగా ఉండబోతుందనేది ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ఓ మంచి పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా తెలియజేయడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. (Nindha Trailer Talk)
రమీజ్ కెమెరా వర్క్, సంతు ఓంకార్ ఆర్ఆర్ హైలెట్ అనేలా ఉన్నాయి. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీరామసిద్ధార్థ కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. జూన్ 21న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.